AP's COVID Bulletin: ఆంధ్రప్రదేశ్‌లో మరో 813 పాజిటివ్ కేసులు నమోదు, ఒక్కరోజులోనే మరో 12 మంది మృతి, రాష్ట్రంలో 13 వేలు దాటిన మొత్తం కోవిడ్19 బాధితుల సంఖ్య
కర్నూల్ నుంచి ఆరుగురు, కృష్ణా నుంచి ఐదుగురు మరియు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఒకరు చొప్పున ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు....
Amaravathi, June 27: ఆంధ్రప్రదేశ్‌లో మరోరోజు కూడా భారీ స్థాయిలోనే కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా మరో 813 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 13,098 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 10,848 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో 25,778 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో గడిచిన ఒక్కరోజులోనే కొత్తగా మరో 12 కరోనా మరణాలు నమోదయ్యాయి. కర్నూల్ నుంచి ఆరుగురు, కృష్ణా నుంచి ఐదుగురు మరియు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఒకరు చొప్పున ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. తాజా మరణాలతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 169 కు పెరిగింది.
AP COVID19 Report:
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 401 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 5,908 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 7,021 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.