YSR Rythu Bharosa: టీడీపీ నేత వర్ల రామయ్య భార్యకు రైతు భరోసా, ధ్రువీకరణ పత్రం అందజేసిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, అర్హత ఉంటే నారా దేవాన్ష్‌కు కూడా అమ్మఒడి ఇస్తామని వెల్లడి

ధ్రువీకరణ పత్రం తీసుకోవడానికి డ్రైవర్‌ను పంపించారు. రైతు భరోసా అందినట్లుగా డ్రైవర్‌ ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించారు.

Vellampalli-Srinivas (Photo-Video Grab)

Amaravati, Oct 28: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చేపట్టిన ‘గడప గడపకి మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విద్యాధరపురంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ (Minister vellampalli Srinivas) గడప గడపకి కార్యక్రమంలో భాగంగా టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఇంటికి వెళ్లారు. ఆయన భార్య జయప్రదకు రైతు భరోసా (Rythu Bharosa Scheme) కింద 13,500 రూపాయలు అందినట్లుగా ధ్రువీకరణ ప్రతాన్ని అందజేశారు.

ఇంటిలోనే ఉన్నప్పటికీ వర్ల రామయ్య (TDP Leader Varla Ramaiah), ఆయన భార్య జయప్రద బయటకురాలేదు. ధ్రువీకరణ పత్రం తీసుకోవడానికి డ్రైవర్‌ను పంపించారు. రైతు భరోసా అందినట్లుగా డ్రైవర్‌ ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.

రోజుకు 19 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి, జెన్‌కో మూడో యూనిట్ జాతికి అంకితం చేసిన సీఎం జగన్,ముఖ్యమంత్రి స్పీచ్ హైలెట్స్ ఇవే...

టీడీపీ నేత వర్ల రామయ్య ఇంట్లో కూడా రైతు భరోసా ఇచ్చామని తెలిపారు. టీడీపీ నేత కూడా ప్రభుత్వ పథకం అందుకున్నారన్నారు. అర్హత ఉంటే నారా దేవాన్ష్‌కు కూడా అమ్మ ఒడి ఇస్తామని వెల్లంపల్లి అన్నారు. అర్హత ఉంటే నారా దేవాన్ష్‌కు కూడా అమ్మఒడి ఇస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. మొత్తానికి టీడీపీ నేతకు కూడా జగన్ సర్కార్ పథకాలు అందాయంటూ స్థానికంగా చర్చించుకున్నారు.



సంబంధిత వార్తలు

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు