AP Municipal Elections Schedule: ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల, మార్చి 10న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు, 75 పురపాలక సంఘాలు, 12 నగర పాలక సంస్థలకు పోలింగ్

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ విడుదల చేసింది. మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు పోలింగ్ జరుగనుంది. మార్చి 10న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అలాగే మార్చి 13న రీపోలింగ్ ఉంటుందని ఎస్‌ఈసీ పేర్కొంది. అలాగే మార్చి 14 ఓట్ల లెక్కింపు జరుగనుంది. సాయంత్రానికి ఫలితాలు ప్రకటిస్తామని ఎస్ఈసీ తెలిపింది.

AP Election Commissioner Nimmagadda Ramesh Kumar | File Photo

Amaravati, Feb 15: ఏపీలో పంచాయితీ ఎన్నికల సమరం ముగియగానే మరో ఎన్నికల సమరానికి ఏపీ ఎస్‌ఈసీ (AP SEC) సిద్ధమైంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ విడుదల చేసింది. మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు పోలింగ్ జరుగనుంది. మార్చి 10న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అలాగే మార్చి 13న రీపోలింగ్ ఉంటుందని ఎస్‌ఈసీ పేర్కొంది. అలాగే మార్చి 14 ఓట్ల లెక్కింపు జరుగనుంది. సాయంత్రానికి ఫలితాలు ప్రకటిస్తామని ఎస్ఈసీ తెలిపింది.

మార్చి 2 నుంచి మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3గంటల లోపు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3గంటల తర్వాత అభ్యర్థుల తుదిజాబితాను విడుదల చేస్తారు. 75పురపాలక సంఘాలు, 12 నగర పాలక సంస్థలకు పోలింగ్ (AP Municipal Elections Schedule) నిర్వహిస్తారు.

గతేడాది మార్చి 11, 12న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు గ్రేటర్ విశాఖ, విజయనగరం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం  కార్పోరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు కేసుల కారణంగా నెల్లూరు, రాజమండ్రిలకు ఎన్నికలు నిర్వహించడం లేదు.

మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా 579 పంచాయతీలు ఏకగ్రీవం, ఈ నెల 17న పోలింగ్, 2,640 పంచాయతీలకు ఎన్నికలు, బరిలో 7,756 మంది అభ్యర్థులు

కాగా గత ఏడాది మార్చి 23న నిర్వహించాల్సిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా ప్రభావంతో అదే నెల 15న వాయిదా పడ్డాయి. 12 నగరపాలక సంస్థల్లో డివిజన్లు/వార్డులకు అప్పట్లో నామినేషన్లు వేశారు. 75 పురపాలక, నగర పంచాయతీల్లోనూ వార్డులకు నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరణ దశలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆ ప్రక్రియను ఇప్పుడు కొనసాగిస్తూ ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.

ఎన్నికలు జరిగే మున్సిపల్‌ కార్పొరేషన్లు:

విజయనగరం, విశాఖ, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం

ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు:

శ్రీకాకుళం జిల్లా: ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, పాలకొండ

విజయనగరం జిల్లా: బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, నెల్లిమర్ల

విశాఖ జిల్లా: నర్సీపట్నం, యలమంచిలి

తూర్పుగోదావరి జిల్లా: అమలాపురం, తుని, పిఠాపురం, సామర్లకోట, మండపేట, రామచంద్రాపురం, ఏలేశ్వరం, గొల్లప్రోలు, ముమ్మిడివరం

పశ్చిమగోదావరి జిల్లా: నర్సాపురం‌, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం

కృష్ణా జిల్లా: నూజివీడు, పెడన, ఉయ్యూరు, నందిగామ, తిరువూరు

గుంటూరు జిల్లా: తెనాలి, చిలకలూరిపేట, రేపల్లె, మాచర్ల, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల

ప్రకాశం జిల్లా: చీరాల, మార్కాపురం, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు

అనంతపురం జిల్లా: హిందూపురం, గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, కదిరి

అనంతపురం జిల్లా: రాయదుర్గం, గుత్తి, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, మడకశిర

కర్నూల్‌ జిల్లా: ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్‌, ఆళ్లగడ్డ

కర్నూల్‌ జిల్లా: నందికొట్కూరు, గూడూరు(K), ఆత్మకూరు(K)

వైఎస్సార్‌ జిల్లా: ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేల్‌, రాయచోటి, మైదుకూరు, ఎర్రగుంట్ల

చిత్తూరు జిల్లా: మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, నగరి, పుత్తూరు