Andhra Pradesh Shocker: దారుణం..భార్యను రోకలి బండతో కొట్టి, కత్తితో గొంతును కోసి చంపేసిన కసాయి భర్త, అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానమే కారణం, కేసును దర్యాప్తు చేస్తున్న అనంతపూర్ డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీఐ కత్తి శ్రీనివాసులు

అర్ధరాత్రి దాటిన తర్వాత రోకలిబండతో లక్ష్మి తలపై మోదాడు. అనంతరం కత్తి తీసుకుని అపస్మార స్థితిలో పడి ఉన్న భార్య గొంతు (gruesome murder) కోశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె మృతి చెందిన అనంతరం అక్కడి నుంచి ఆదినారాయణ పరారయ్యాడు.

Image used for representational purpose only | (Photo Credits: PTI)

Anantapur, August 17: అనంతపురంలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను అనుమానంతో ఓ భర్త (Andhra Pradesh Shocker) దారుణంగా హత్య చేశాడు. నాల్గో పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. అనంతపురంలోని సంగమేష్‌ నగర్‌కు చెందిన ఆదినారాయణకు వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వెంగమ్మ అలియాస్‌ లక్ష్మి (30)తో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి నిఖిల్‌ (11), రామ్‌చరణ్‌ (8) అనే పిల్లలున్నారు.

ప్రస్తుతం చంద్రబాబు కొట్టాలు ప్రాంతంలో నివాసముంటూ స్థానిక టమాట మండిలో కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో వ్యక్తితో లక్ష్మి వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే అనుమానాలు ( Suspicious Illegal Affair) ఆదినారాయణలో బలపడ్డాయి. ఈ విషయంగానే దంపతుల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకునేవి. ఇక పాఠశాలకు సెలవు కావడంతో పెద్ద కుమారుడు నిఖిల్‌ను ప్రొద్దుటూరులోని తల్లిదండ్రుల వద్ద లక్ష్మి వదిలింది. ఆదివారం రాత్రి ఇంటిలో చిన్న కుమారుడు రామ్‌చరణ్‌ నిద్రిస్తున్నాడు.

నాతో సెక్స్ చేయ్..డబ్బులు ఎంతైనా ఇస్తా, 16 ఏళ్ల బాలుడితో 42 మహిళా టీచర్ ఛాటింగ్, అమెరికాలో షాకింగ్ ఘటన, నిందితురాలిని అరెస్ట్ చేసి సమ్నర్ కౌంటీ జైలుకు తరలించిన పోలీసులు

ఆ సమయంలో లక్ష్మితో ఆదినారాయణ గొడవపడ్డాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత రోకలిబండతో లక్ష్మి తలపై మోదాడు. అనంతరం కత్తి తీసుకుని అపస్మార స్థితిలో పడి ఉన్న భార్య గొంతు (gruesome murder) కోశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె మృతి చెందిన అనంతరం అక్కడి నుంచి ఆదినారాయణ పరారయ్యాడు. సోమవారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన స్థానికుల సమాచారం మేరకు డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీఐ కత్తి శ్రీనివాసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని, పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలో దింపారు.