Andhra Pradesh: భర్త పరాయి మగాడి భార్యను రేప్ చేస్తుంటే వీడియో తీసిన భార్య, ఆ తర్వాత స్నేహితులతో పడుకోవాలని వీడియోతో బ్లాక్ మెయిల్, భార్యభర్తలిద్దర్నీ అరెస్ట్ చేసిన పోలీసులు
ఎదురింట్లో ఉంటున్న వివాహితను బలవంతంగా ఇంట్లోకి లాక్కొచ్చి ఆమెపై అత్యాచారానికి (Husband rapes woman ) పాల్పడ్డాడో ఓ కామాంధుడు. భర్త చేస్తున్న తప్పుడు పనిని అడ్డుకోవాల్సిన అతడి భార్య ఈ దారుణాన్ని వీడియో (wife records incident in Vijayawada ) తీసింది
Vijayawada, Feb 9: విజయవాడలో దారుణ ఘటన (Andhra Pradesh Shocker) చోటు చేసుకుంది. ఎదురింట్లో ఉంటున్న వివాహితను బలవంతంగా ఇంట్లోకి లాక్కొచ్చి ఆమెపై అత్యాచారానికి (Husband rapes woman ) పాల్పడ్డాడో ఓ కామాంధుడు. భర్త చేస్తున్న తప్పుడు పనిని అడ్డుకోవాల్సిన అతడి భార్య ఈ దారుణాన్ని వీడియో (wife records incident in Vijayawada ) తీసింది. విజయవాడ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. అజిత్‌సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన బాధిత వివాహిత భర్త (25) కేటరింగ్ చేస్తుంటాడు.
ఈ నెల 3న ఆమె తన ఇంట్లో పిల్లలతో కలిసి నిద్రపోతుండగా, వారి ఎదురింట్లో నివసించే దిలీప్, తులసి దంపతులు రాత్రి 11 గంటల సమయంలో ఆమె ఇంట్లోకి ప్రవేశించారు. బాధిత మహిళ నోరు గట్టిగా మూసి తమ ఇంట్లోకి లాక్కెళ్లారు. ఆపై నిందితుడు ఆమెపై రెండుసార్లు అత్యాచారానికి పాల్పడగా, అతడి భార్య వీడియోలు, ఫొటోలు తీసింది. ఆ తర్వాతి రోజు ఆ వీడియోలను చూపించి మరోమారు అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పిల్లలను చంపేస్తానని, ఫొటోలు బయటపెట్టి పరువు తీస్తానని హెచ్చరించాడు.
తాజాగా, తన స్నేహితుల కోరిక కూడా తీర్చాలని నిందితుడు పదేపదే వేధిస్తుండడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. నిందితులైన దిలీప్, తులసిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్యా భర్తలపై ఐపీసీ 376(2) 354బి, 354డి, 109 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఆ రేప్ ఘటనకు కారణాలు ఇంకా తెలియలేదు.