Andhra Pradesh: ఏప్రిల్‌ 18న ఈబీసీ నేస్తం, ఏప్రిల్‌ 10న వాలంటీర్లకు సన్మానం, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కార్యక్రమాల షెడ్యూల్‌ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సీఎంవో అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలతో పాటు మార్చి, ఏప్రిల్‌ నెలలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అమలుచేయాల్సిన పథకాల తేదీల ఖరారుపై అధికారులతో చర్చించారు

AP CM Jagan mohan reddy (Photo-PTI)

Amaravati Mar 7:ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సీఎంవో అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలతో పాటు మార్చి, ఏప్రిల్‌ నెలలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అమలుచేయాల్సిన పథకాల తేదీల ఖరారుపై అధికారులతో చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా పలు కార్యక్రమాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్‌ ముగియనుండడంతో ఈ కార్యక్రమాలు, పథకాల అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

ఎన్నికల కోడ్‌తో సంబంధం లేని కారణంగా మార్చి 10 నుంచి మధ్యాహ్న భోజనంతో పాటుగా రాగిజావ అమలు ప్రారంభం, మార్చి 14 నుంచి అసెంబ్లీలో సమావేశాల నిర్వహణకు సీఎంవో నిర్ణయం తీసుకుంది. బీఏసీ సమావేశంలో సమావేశాల షెడ్యూలు ఖరారైంది. మార్చి 18 సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం.. జగనన్న విద్యా దీవెన లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటి పద్ధతిలో నగదు జమ చేయనున్నారు.

మార్చి 15న ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ప్రారంభించనున్న సీఎం జగన్, 35,41,151మంది అవ్వా తాతల కోసం వైఎస్సార్‌ కంటి వెలుగును ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి

కార్యక్రమాల షెడ్యూల్‌:

♦మార్చి 22న ఉగాది రోజున ఉత్తమ సేవలందించిన వాలంటీర్ల పేర్ల ప్రకటన, వీరికి ఏప్రిల్‌ 10న అవార్డులు, రివార్డులు

♦మార్చి 23న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం

♦మార్చి 25 నుంచి వైఎస్సార్‌ ఆసరా... ఏప్రిల్‌ 5 వరకూ కార్యక్రమం కొనసాగనుంది.

♦మార్చి 31న జగనన్న వసతి దీవెన

♦ఏప్రిల్‌ 6న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ అమలు

♦ఏప్రిల్‌ 10న వాలంటీర్లకు సన్మానం

♦ఏప్రిల్‌ 18న ఈబీసీ నేస్తం