Three Capital Bill Withdrawn: మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్న ఏపీ ప్రభుత్వం, కాసేపట్లో అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ అధికారికంగా ప్రకటన

మూడు రాజధానుల బిల్లును వెనక్కి (Three Capital Bill Withdrawn) తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌ తెలిపారు. మూడు రాజధానులపై (Three Capitals Bill) అసెంబ్లీలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కాసేపట్లో అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ (CM YS Jagan) అధికారికంగా ప్రకటిస్తారని ఏజీ కోర్టుకు తెలిపారు.

AP Three Capital (Photo-File Photo)

Amaravati, Nov 22: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును వెనక్కి (Three Capital Bill Withdrawn) తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌ తెలిపారు. మూడు రాజధానులపై (Three Capitals Bill) అసెంబ్లీలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కాసేపట్లో అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ (CM YS Jagan) అధికారికంగా ప్రకటిస్తారని ఏజీ కోర్టుకు తెలిపారు.కాగా ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కాసేపటి క్రితం జరిగిన కేబినెట్ మీటింగులో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో జగన్ ప్రకటించబోతున్నారు. రాజధానికి సంబంధించి కొత్త బిల్లును సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

మరోవైపు వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసినట్టు హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ తెలిపారు. అమరావతి కేసులను విచారిస్తున్న హైకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి ఈ విషయాన్ని వెల్లడించారు. మరోవైపు కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి కొడాలి నానిని మీడియా ప్రతినిధులు ఈ విషయంపై ప్రశ్నించగా... అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను బయటకు చెప్పడం నిబంధనలకు విరుద్ధమని... ఆ విషయం గురించి అసెంబ్లీలో సీఎం జగన్ చెపుతారని అన్నారు.

విపత్తులో సాయం చేస్తూ మృతి చెందిన వారికి వెంటనే రూ. 25 లక్షలు పరిహారం ఇవ్వండి, వారికి వెంటనే కొత్త ఇల్లు మంజూరు చేయండి, అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం జగన్

మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ఐకాస ఆధ్వర్యంలో సుమారుగా రెండేళ్ల నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అమరావతి రైతులతో సహా పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీనిపై ప్రస్తుతం హైకోర్టులో , సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి.