AP New Cabinet: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణపై కసరత్తు పూర్తి, సీల్డ్ కవర్‌లో రాజ్‌భవన్‌కు 25 మంది మంత్రుల జాబితా, సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసిన సీఎం జగన్

ఏపీ మంత్రుల రాజీనామా లేఖలు రాజ్‌భవన్‌కు చేరాయి. ఉదయం 11 గంటల తర్వాత మంత్రుల రాజీనామాలను గవర్నర్‌ ఆమోదించే అవకాశముంది. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత గెజిట్‌ (gazette)విడుదలయ్యే అవకాశం ఉంది. ఆదివారం మధ్యాహ్నం వరకు కేబినెట్ కూర్పుపై జగన్ కసరత్తు చేయనున్నారు. మధ్యాహ్నం తర్వాత.. లిస్ఠ్ ఫైనల్ చేసి కొత్త మంత్రులకు సమాచారమిస్తారు.

YS Jagan Cabinet (Photo-Twitter)

Vijayawada, April 10: కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం సమీపిస్తుండటంతో.. ఏపీ మంత్రుల రాజీనామా లేఖలు రాజ్‌భవన్‌కు (Rajbhavan) చేరాయి. ఉదయం 11 గంటల తర్వాత మంత్రుల రాజీనామాలను గవర్నర్‌ (Governor) ఆమోదించే అవకాశముంది. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత గెజిట్‌ (gazette)విడుదలయ్యే అవకాశం ఉంది. ఆదివారం మధ్యాహ్నం వరకు కేబినెట్ కూర్పుపై జగన్ కసరత్తు చేయనున్నారు. మధ్యాహ్నం తర్వాత.. లిస్ఠ్ ఫైనల్ చేసి కొత్త మంత్రులకు సమాచారమిస్తారు. ప్రస్తుతం 56 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మరింత ప్రాధాన్యం ఇచ్చినట్లు, ఇప్పటిదాకా ఉన్న కేబినెట్‌లోని 10 మంది కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం మంత్రుల రాజీనామాలను సీఎం జగన్ రాష్ట్ర గవర్నర్ కు పంపారు. 25 మందితో రాజ్‌భవన్‌కు ఆదివారం కొత్త జాబితా పంపనున్నారని తెలుస్తోంది. కేబినెట్‌ బెర్తు దక్కించుకున్న వారికి సీఎంవో నుంచి ఆదివారం ఫోన్ కాల్స్ వెళ్లనున్నాయి. సోమవారం ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణం చేయనున్నారు. తాత్కాలిక సచివాలయంలో బ్లాక్‌–1 పక్కన వేదిక సిద్ధం చేశారు.

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు, ఈ నెల 11న అసెంబ్లీ భవన ప్రాంగణంలోనే కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం..

కరకట్ట రోడ్డుపై ప్రజా ప్రతినిధులు, అధికారులకు మాత్రమే అనుమతినివ్వనున్నారు.ప్రజలు, అభిమానులకు మంగళగిరి, ఎర్రబాలెం మీదుగా ఓ మార్గం, ఉండవల్లి సెంటర్, కృష్ణాయపాలెం మీదుగా మరో మార్గం ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత పాత, కొత్త మంత్రులతో కలిసి సీఎం జగన్‌, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తేనీటి విందులో పాల్గొననున్నారు. నూతన మంత్రుల ప్రమాణ స్వీకారానికి (New Ministers) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, అధికారులకు ఆహ్వానాలు పంపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి Aa, A1, A2, B1, B2 కేటగిరీలుగా పాసులు జారీ చేశారు.

Power Holiday In AP: పరిశ్రమలకు శుక్రవారం నాడు పవర్‌ హాలిడే, గృహ వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నామన్న ఎస్పీడీసీఎల్‌ సీఎండీ హరనాథ రావు

కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార ఏర్పాట్లను వివిధ శాఖలకు విధులను అప్పగిస్తూ జీఏడీ (రాజకీయ) కార్యదర్శి రేవు ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను కూడా సాధారణ పరిపాలన (ప్రోటోకాల్‌) విభాగం ఇప్పటికే సిద్ధం చేసింది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక కొత్త, పాత మంత్రులు, అతిధులకు మధ్యాహ్నాం 1 గంటకు సచివాలయంలో తేనేటీ విందు (హైటీ) ఏర్పాటు చేశారు.



సంబంధిత వార్తలు

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..