Andhra Pradesh: ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ రెడీ, క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయిన కంపెనీ ప్రతినిధులు
ఏపీలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (Tata Advanced Systems Limited) ప్రతినిధులు సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు.
Amaravati, August 30: ఏపీలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (Tata Advanced Systems Limited) ప్రతినిధులు సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, అవకాశాలపై సీఎం వైఎస్ జగన్‌తో (YS Jagan Mohan Reddy) చర్చించారు.
అలాగే.. రక్షణ వైమానిక రంగంలో తయారీ, నిర్వహణ తదితర అంశాల్లో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కార్పొరేట్ ఎఫైర్స్, రెగ్యులేటరీ హెడ్ జే. శ్రీధర్, టాటా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ హెడ్ మసూద్ హుస్సేనీ ఉన్నారు.
మంగళగిరిలో టీడీపీకి భారీ షాక్, వైసీపీ తీర్థం పుచ్చుకున్న కీలకనేత గంజి చిరంజీవి
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంలో ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా తాము సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల్ వలవెన్, ఏపీఈడీబీ సీఈవో జవ్వాది సుబ్రహ్మణ్యం, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.