Andhra Pradesh: కదులుతున్న రైలు నుంచి కింద పడిన భర్తను కాపాడబోయి భార్య మృతి, అనంతపురంలో విషాదకర ఘటన

కదులుతున్న రైలు నుంచి పట్టు తప్పి కిందపడిన భర్త ప్రాణాలు కాపాడబోయి ఓ వివాహిత మృతి (Wife dies while trying to save husband) చెందింది

Representational Picture. Credits: PTI

Anantapur, May 9: అనంతపురంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న రైలు నుంచి పట్టు తప్పి కిందపడిన భర్త ప్రాణాలు కాపాడబోయి ఓ వివాహిత మృతి (Wife dies while trying to save husband) చెందింది. జీఆర్పీ ఎస్‌ఐ విజయకుమార్‌ తెలిపిన మేరకు... అనంతపురం మండలం రాచానుపల్లికి చెందిన గోపాల్, రమాదేవి (35) దంపతులు. వీరికి మూడేళ్ల కుమారుడు యశ్వంత్, రెండేళ్ల కుమార్తె మేఘన ఉన్నారు. శనివారం రాత్రి గుంతకల్లుకు వెళ్లేందుకు అనంతపురం రైల్వే స్టేషన్‌లో కాచిగూడ రైలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. బీఫార్మసీ విద్యార్థి మృతి కేసులో ట్విస్ట్, ప్రియుడు సాధిక్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, అతనిపై 420, 376, 306 సెక్షన్ల కింద కేసు నమోదు

తొలుత భార్య, ఇద్దరు పిల్లలను గోపాల్‌ ఎక్కించారు. అప్పటికే రైలు ముందుకు కదిలింది. ఆ సమయంలో పట్టుతప్పి అతను కిందపడ్డాడు. భర్తను కాపాడబోయి రమాదేవి రైలుకు, ప్లాట్‌ఫాంకు మధ్యలో ఇరుక్కుపోయింది. విషయాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్‌ లాగి రైలును ఆపారు. అప్పటికే దంపతలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సర్వజనాస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక శనివారం అర్ధరాత్రి రమాదేవి మృతి చెందింది. పిల్లలు సురక్షితంగా ఉన్నారు. ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.