Andhra Pradesh: కాపుల అభివృద్ధే ధ్యేయంగా 3 తీర్మానాలు, 70 లక్షల మంది కాపులకు సంక్షేమ పథకాల లబ్ధి, రాజమండ్రిలో కాపు నేతల సమావేశం

కాపుల రాజకీయ సాధికారత కోసం సీఎం జగన్ విశేష కృషి చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. వైఎస్సార్‌ సీపీ కాపు ముఖ్య నేతలు సోమవారం నాడు రాజమండ్రి వేదికగా కీలక సమావేశం నిర్వహించారు.

YSRCP passes 3 resolutions for the Kapu community (Photo-Video Grab)

Amaravati, Oct 31: వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో కాపులకు పెద్దపీట వేసిందని కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, కీలక నేతలు పేర్కొన్నారు. కాపుల రాజకీయ సాధికారత కోసం సీఎం జగన్ విశేష కృషి చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. వైఎస్సార్‌ సీపీ కాపు ముఖ్య నేతలు సోమవారం నాడు రాజమండ్రి వేదికగా కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత మూడేళ్లలో కాపు సామాజిక వర్గం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల సమాచారాన్ని చర్చలో పంచుకున్నారు.

కాపు సంక్షేమం కోసం సీఎం జగన్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నేతలంతా ఏకతాటిపైకి వచ్చారు. రాజమండ్రిలోని మంజీరా హోటల్ లో జరిగిన ఈ చర్చలో డిప్యూటీ సీఎం కొట్లు సత్యనారాయణ, మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, రాజమండ్రి ఇంచార్జి జక్కంపూడి రాజాతో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు పాల్గొన్నారు.

మూడు తీర్మానాలకు ఆమోదం

రాజమండ్రిలోని కాపు నేతల సమావేశంలో మంత్రులు, కీలక నేతలు ప్రధానంగా మూడు తీర్మానాలు ఆమోదించారు. మొదటిగా జిల్లా పరిషత్ చైర్మన్లతో పాటు రాష్ర్టంలోని అన్ని నామినేటెడ్ పదవుల్లో ఉన్న కాపు నేతలను ఆహ్వానించి కాపు సంక్షేమ రోడ్ మ్యాప్ రూపొందించేలా భారీ వేదికను ఏర్పాటు చేయనున్నారు. రెండవది కాపుల అభ్యున్నతి కోసం రాష్ర్ట ప్రభుత్వం చేస్తున్న ఆవిరళ కృషిని, సంక్షేమ పథకాల లబ్ధిని ఇంటింటికీ చేర్చే కార్యక్రమం ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు. మూడో తీర్మానంలో భాగంగా సీనియర్ కాపు నేతలతో చర్చింది భవిష్యత్తులో కాపుల సంఓేమం, అభివఅద్ధి కోసం చేపట్టాల్సిన మరిన్ని కార్యక్రమాలను రూపొందించనున్నారు.

కాపు వర్గీకరణకు నిర్ణయాత్మక విధానం

గత మూడేళ్లలో కాపుల సాధికారత కోసం సీఎం జగన్ తరహాలో ఎవరూ క`షి చేయలేదని, వైఎస్సార్ సీపీ హయాంలోనే కాపుల వర్గీకరణకు నిర్ణయాత్మక విధానాన్ని తీసుకువచ్చినట్లు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. కాపు నేతల మేథోమథన సమావేశం అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంలోని అన్ని స్థాయిలలో కాపు నాయకుల ప్రాతినిధ్యాన్ని మెరుగు పరుస్తామన్న హామీని సీఎం జగన్ వంద శాతం నిలబెట్టుకున్నారని వివరించారు. ఈ మేరకు జరిగిన సమావేశంలో సభ్యులు ఆమోదించినట్లు తెలిపారు. రాష్ర్ట కేబినేట్లో కాపు సామాజిక వర్గానికి చెందిన నలుగురు ఉన్నట్లు వివరించారు. ఒక డిప్యూటీ సీఎం పదవిని కాపుల కోసం కేటాయించడం సీఎం జగన్ కు కాపులపై ఉన్న ప్రత్యేక అబిమానానికి నిదర్శనమన్నారు.

మాజీ మంత్రి నారాయణకు షాక్, బెయిల్‌ రద్దు చేసిన చిత్తూరు కోర్టు, నవంబర్‌ 30లోగా పోలీసులకు లొంగిపోవాలని ఆదేశాలు

అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరుపున కాపులకు ఇతర సామాజికవర్గాల కంటే 15 శాతం ఎక్కువ ప్రాతినిధ్యం ఇచ్చినట్లు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి ఎన్నికైన ఇద్దరు మేయర్లు, ఏడుగురు మున్సిపల్ చైర్మన్లు, 44 మంది ఎంపీపీ అభ్యర్థులు కాపు సామాజిక వర్గానికి చెందిన వారేనని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కాపుల కోసం చేసిన దానికంటే ఇది చాలా ఎక్కువ అని మంత్రి తెలిపారు. గత మూడేళ్ల కాలంలో పలు సంఓేమ పథకాల కింద రూ. 26,490.12 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.

ఇది గత ప్రభుత్వం ఖర్చు చేసిన దానికంటే 14 రెట్లు అధికంగా ఉన్నట్లు నిర్ధారించారు. గత ప్రభుత్వం 2.5 లక్షల మంది కాపు లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 70 లక్షల మందికి పైగా కాపులకు లబ్ధి చేకూరింది. రాష్ర్ట చరిత్రలో మొట్ట మొదటి సారిగా మొత్తం కాపు సామాజిక వర్గంలోని 90 శాతం మందికి పైగా జీవనోపాధి, సంఓేమ పథకాలకు చెందిన ప్రయోజనాలను అందుకున్నట్లు నాలుగు గంటలకు పైగా జరిగిన ఈ మేధోమథన సమావేశంలో మంత్రులు వివరించారు.

కాపు ఓట్ల కోసం ప్రతిపక్షాల కుట్ర

కాపు ఓట్లను కొందరి స్వప్రయోజనాల కోసం తాకట్టు పెట్టి కాపుల సంకల్పాన్ని దుర్వినియోగం చేయాలని చూస్తున్న ప్రతిపక్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సూచించారు. గత టీడీపీ హయాంలో కాపు వ్యతిరేక కార్యకలాపాలు ఎన్నో జరిగాయని గుర్తుచేశారు. ఎన్నికలకు ముందు రిజర్వేషన్లకు ఇస్తామని వాగ్ధానం చేసి ఆ తర్వాత మోసం చేశారని విమర్శించారు.

కాపుల కోసం ఉద్యమించిన ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని టీడీపీ ప్రభుత్వం వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వేధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్ సంఓేమ పథకాల ద్వారా ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా సమాజంలో కాపుల స్థాయిని పెంచారని తెలిపారు. ఈ ప్రభుత్వం కాపులకు చేస్తున్న మంచిని కాపు సోదరులందరికీ తెలియజేస్తామని మంత్రి అంబటి పేర్కొన్నారు. కాపులపై జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన తీవ్ర వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. ‘‘ఇటీవల కాపుల గురించి పవన్ కళ్యాణ్ ఎలా కించపరిచేలా మాట్లాడారో మనం అందరం చూశాం. మీ వర్గాన్ని మొత్తం దూషించిన ఓ ‘సెలబ్రిటీ’ పార్టీ నాయకుడిపై కాపు యువత నమ్మకం పెట్టుకోవద్దని కోరారు.



సంబంధిత వార్తలు

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Kambhampati Hari Babu: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు, మిజోరం గవర్నర్‌గా వీకే సింగ్...5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను నియమించిన కేంద్రం

Sandhya Theatre Stampede Case: వీడియో ఇదిగో, ఇరవై రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన శ్రీతేజ్, అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వం మాకు మద్దతు ఇస్తున్నారని తెలిపిన తండ్రి భాస్కర్