YSR Sunna Vaddi Scheme: రూ.199.94 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసిన ఏపీ ప్రభుత్వం, వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడి తీసుకొచ్చామని తెలిపిన ఏపీ సీఎం జగన్
రబీ 2020–21, ఖరీఫ్–2021 సీజన్లకు చెందిన వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ (YSR Sunna Vaddi Scheme), ఖరీఫ్–2022 సీజన్‌లో వివిధ రకాల వైపరీత్యాలవల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు గతంలో సాంకేతిక కారణాలతో చెల్లింపులు పొందని వారి ఖాతాల్లో మొత్తం రూ.199.94 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది.
Amaravati, Nov 28: రబీ 2020–21, ఖరీఫ్–2021 సీజన్లకు చెందిన వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ (YSR Sunna Vaddi Scheme), ఖరీఫ్–2022 సీజన్‌లో వివిధ రకాల వైపరీత్యాలవల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు గతంలో సాంకేతిక కారణాలతో చెల్లింపులు పొందని వారి ఖాతాల్లో మొత్తం రూ.199.94 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది.తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేశారు.
రబీ 2020–21 సీజన్‌లో అర్హత పొందిన 2.54 లక్షల మందికి రూ.45.22 కోట్లు, ఖరీఫ్–2021 సీజన్‌లో అర్హత పొందిన 5.68 లక్షల మందికి సున్నా వడ్డీ రాయితీ కింద రూ.115.33 కోట్లు జమ చేశారు. అదే విధంగా ఖరీఫ్–2022 సీజన్‌లో జూలై నుంచి అక్టోబర్ మధ్య గోదావరి వరదలు, అకాల వర్షాలవల్ల దెబ్బతిన్న 45,998 మంది రైతులకు రూ.39.39 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ఖరీఫ్ సీజన్ ముగియక ముందే జమ చేశారు.
మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా నివాళి అర్పించిన సీఎం జగన్
గడిచిన మూడేళ్లలో 20.85 లక్షల మందికి రూ.1,795.40 కోట్ల పంట నష్టపరిహారం జమచేయగా, తాజాగా జమచేయనున్న మొత్తంతో కలిపి 21.31 లక్షల మంది రైతన్నలకు రూ.1,834.79 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ జమ చేసినట్లవుతుంది.అలాగే, గడిచిన మూడేళ్లలో 65.65 లక్షల మందికి రూ.1,282.11 కోట్ల సున్నా వడ్డీ రాయితీ సొమ్ములు చేయగా, తాజాగా జమచేయనున్న మొత్తంతో కలిపి 73.88 లక్షల మంది రైతన్నలకు రూ.1,834.55 కోట్ల సున్నా వడ్డీ రాయితీ అందినట్లు అవుతుంది.గడిచిన మూడేళ్ల ఐదు నెలల్లో వివిధ పథకాల కింద రైతన్నలకు రూ. 1,37,975.48 కోట్ల సాయం అందించారు.
సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్
వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడి తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan MOhan Reddy) అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. వ్యవసాయ రంగంపై 62 శాతం జనాభా ఆధారపడి ఉన్నారని సీఎం పేర్కొన్నారు.గతంలో రుణాల్ని మాఫీ చేస్తామని చంద్రబాబు మోసం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రుణమాఫీకి కేవలం రూ.15 వేల కోట్లే ఇచ్చారన్నారు. కానీ రైతు భరోసా కిందే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.25,971 కోట్లు ఇచ్చిందన్నారు.
రైతులను అన్ని రకాలుగా ఆదుకోగలిగితేనే ఏ రాష్ట్రమైన బాగుంటుందన్నారు. క్రమం తప్పకుండా రైతులకు పరిహారం చెల్లిస్తున్నాం. జులై-అక్టోబర్ వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో పరిహారం ఇస్తున్నాం’’ అని సీఎం అన్నారు.మన ప్రభుత్వం వచ్చాకే రైతులకు న్యాయం జరుగుతోందన్నారు. అప్పటి ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా గమనించండి.. గతంలో రైతు భరోసా పథకం లేదు. ఒకేసారి రైతులకు రెండు రకాల సాయం అందించాం. చంద్రబాబు ప్రభుత్వం సున్నా వడ్డీని ఎగ్గొట్టింది’’ అని సీఎం అన్నారు.
పంటల బీమాను ఉచితంగా అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వంలో పంట అంచనాలు అశాస్త్రీయంగా ఉండేవి. మా ప్రభుత్వంలో ఈ-క్రాప్ విధానంలో రైతులకు సాయం అందిస్తున్నాం. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి ఆశీస్సులు ఉంటాయి’’ అని సీఎం జగన్ అన్నారు.