AP Pilgrims Rescued: పెను ప్రమాదం నుంచి బయటపడిన నిడదవోలు వాసులు.. నిడదవోలు నుంచి వారణాసికి 120 మంది.. గంగానదిలో  బోటులో వెళ్లిన 40 మంది.. నదిలో కొంతదూరం వెళ్లాక బోటుకు చిల్లు.. బోల్తాపడిన బోటు.. అందరినీ రక్షించిన స్థానికులు
Representational (Credits: Twitter/ANI)

Amaravati, Nov 27: ఏపీలోని (AP) నిడదవోలు (Nidadavole) వాసులు త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు, పరిసర ప్రాంతాలకు చెందిన 120 మంది ఈ నెల 20న తీర్థయాత్రలకు బయలుదేరారు. అలహాబాద్ (Allahabad), గయ (Gaya), అయోధ్య (Ayodhya)ను సందర్శించుకుని శుక్రవారం వారణాసి (Varanasi) చేరుకున్నారు.

చైనాలో ఒక్కరోజులోనే దాదాపు 40 వేల కొవిడ్ కేసులు.. అంతటా లాక్ డౌన్.. లాక్‌ డౌన్‌కు వ్యతిరేకంగా ఆగ్రహ జ్వాలలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు

గంగానదిలో పిండ ప్రదానాలు చేయాలని భావించిన 40 మంది నిన్న పడవలో నది దాటుతుండగా కొంతదూరం వెళ్లాక పడవకు చిల్లు పడింది. అది చూసిన అందులోని వారు భయంతో కేకలు వేశారు. దీంతో బోటును వెనక్కి మళ్లించేందుకు డ్రైవర్ ప్రయత్నిస్తున్న సమయంలో వారంతా భయంతో అటూఇటూ కదలడంతో అదుపుతప్పిన బోటు బోల్తాపడింది (Capsized).

ఆటను ఆపేసిన వరుణుడు.. 4.5 ఓవర్ల వద్ద ఆగిన ఆట.. భారత్‌కు ఈ మ్యాచ్ కీలకం.. మ్యాచ్ కొనసాగడం కష్టమే!

నదిలో పడిన వారు తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేయడంతో సమీపంలో ఉన్న మిగతా బోట్ల వారు స్పందించారు. వెంటనే అక్కడికి చేరుకుని మునిగిపోయిన 40 మందిని రక్షించారు. మరోవైపు, విషయం తెలిసిన వారణాసి కలెక్టర్, పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.