Representational (Credits: Twitter/ANI)

Beijing, Nov 27: చైనాలో(China) కరోనా (Corona) మళ్ళీ విలయతాండవం చేస్తున్నది. దేశవ్యాప్తంగా ఒక్కరోజులోనే 39,791 కేసులు (Cases) నమోదయ్యాయి. వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇదే రికార్డు. రాజధాని బీజింగ్ (Beijing) లో కొత్తగా 4,307 కేసులు (New Cases) నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్న దృష్ట్యా అధికారులు లాక్ డౌన్ (Lockdown) విధించారు.

అయితే, లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా చైనా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. వాయవ్య చైనాలోని జిన్‌జియాంగ్ ప్రాంతంలోని ఓ రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రజలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. లాక్‌డౌనే వారి ప్రాణాలు తీసిందని, దానిని తక్షణం ఎత్తివేయాలంటూ పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు.

తరచుగా పాము కాటేస్తున్నట్టు ఓ రైతుకు కలలు.. పరిష్కారం కోసం జ్యోతిష్యుడ్ని సంప్రదించిన రైతు.. పాము పుట్ట ముందు నాలుకను బయటకు తీసి ప్రార్తించాలని సూచన.. రైతు అలా చేస్తూ ఉండగా.. పుట్టలోంచి బయటకు వచ్చిన పాము అతన్ని ఏం చేసిందంటే??