Representational (Credits: Twitter/ANI)

Chennai, Nov 27: జ్యోతిష్యుడి (Astrologer) మాటలు విని ఆసుపత్రి (Hospital) పాలైన ఓ వ్యక్తి కథ ఇది. తమిళనాడులో (TamilNadu) ఈరోడ్ లోని గోపిచెట్టిపాళయంకు చెందిన రాజా (Raja) ఓ రైతు (Farmer). ఆయన వయసు 54 సంవత్సరాలు. రాజాకు ఇటీవల తరచుగా పాము (Snake) కరుస్తున్నట్టుగా (Bite) కలలు (Dreams) వస్తున్నాయి. దాంతో భయపడిపోయిన ఆ రైతు ఓ జ్యోతిష్యుడి వద్దకు పరుగెత్తాడు. పాము కాటేస్తున్నట్టు కలలు వస్తున్న విషయాన్ని అతడికి వివరించాడు. దాంతో, ఈ పీడకలలు తొలగిపోవాలంటే పాము పుట్ట ఉన్న ఓ సర్పదేవాలయానికి వెళ్లి పూజలు చేయాలని, పాము ముందు మూడుసార్లు నాలుక (Tongue) బయటికి చాపాలని సలహా ఇచ్చాడు.

చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోల మృతి.. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు.. మావోల సమావేశం జరుగుతుండగా ఘటన

ఆయన చెప్పినట్టుగానే రాజా ఓ సర్ప మందిరానికి వెళ్లి పూజలు చేశాడు. అనంతరం, ఆలయంలోని పుట్ట వద్దకు వెళ్లి మూడుసార్లు నాలుక బయటికి చాపాడు. అయితే ఆ పుట్టలో ఉన్న రక్తపింజరి పాము రాజా నాలుకపై కసిదీరా కాటేసింది. ఇది గమనించిన ఆలయ పూజారి, రాజా కుటుంబ సభ్యులు వెంటనే స్పందించారు. కాటు వేసిన నాలుక భాగాన్ని కోసివేసి, రాజాను హుటాహుటీన ఈరోడ్ లోని మణియన్ ఆసుపత్రికి తరలించారు.

సైబర్‌ నేరగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయిన జీవితా రాజశేఖర్, సగం ధరకే జియో ప్రోడక్టులు ఇస్తానంటూ కహానీలు చెప్పిన క్రిమినల్, నమ్మి లక్షన్నర ట్రాన్స్‌ఫర్ చేసిన జీవిత

ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికే రాజా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. సగం తెగిపోయిన అతడి నాలుకకు చికిత్స చేసిన వైద్యులు, పాము విషానికి విరుగుడుగా యాంటీ వీనమ్ ఇంజెక్షన్ ఇచ్చారు.