AP Volunteers: ఏపీ సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్, త్వరలో వాలంటీర్లకు శుభవార్త చెప్పనున్న టీడీపీ సర్కార్?

దాదాపు ఏపీ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఒకేసారి వాలంటీర్లుగా నియమించి ప్రతి 50 కుటుంంబాలకు ఒక వాలంటీర్ ఉండేలా చర్యలు చేపట్టారు. ఇక జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థకు అద్భుత స్పందన వచ్చింది.

Andhrapradesh volunteer system, CM Chandrababu to announce good news soon!

Vij, Jul 28:  ప్రజల వద్దకే సంక్షేమం ,ప్రభుత్వ పథకాలు అందాలనే ఉద్దేశంలో 2019లో వైసీపీ అధినేత, నాటి ఏపీ సీఎం జగన్ తీసుకొచ్చిన వ్యవస్థే వాలంటీర్ సిస్టమ్. దాదాపు ఏపీ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఒకేసారి వాలంటీర్లుగా నియమించి ప్రతి 50 కుటుంంబాలకు ఒక వాలంటీర్ ఉండేలా చర్యలు చేపట్టారు. ఇక జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థకు అద్భుత స్పందన వచ్చింది.

ఇక గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన స్టేట్‌మెంట్ తో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా అన్న సందేహం కూడా నెలకొంది. దీనికి తోడు అధికారంలోకి వచ్చిన వెంటనే పంచాయతీ రాజ్ ఉద్యోగులతో పెన్షన్‌ను లబ్దిదారుల ఇంటికే వెళ్లి అందేలా చూడటంతో వాలంటీర్ వ్యవస్థకు మంగళం పాడినట్లేననే వాదన వినిపించింది.

అయితే మంత్రి వీరాంజనేయస్వామి ప్రకటనతో ఇప్పుడు వాలంటీర్లలో మళ్లీ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. వలంటీర్ల వ్యవస్థపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. ఇక వాలంటీర్ వ్యవస్థతో ప్రభుత్వానికి మంచే జరుగుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం 50 ఇళ్లకు ఓ వలంటీర్ ఉండగా వీరి పరిధిని పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో ప్రకటన రానుండగా మంత్రి ప్రకటనతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు వాలంటీర్లు.

వాలంటీర్లకు నెలకు 5 వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తుండగా దానిని రూ.10 వేలకు పెంచేలా చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారనే వాదన వినిపిస్తోంది. వాస్తవానికి ఎన్నికలకు ముందు రెండు నెలలు ఆ తర్వాత రెండు నెలలు వాలంటీర్లు ఎలాంటి విధులు అప్పగించలేదు. ఏపీలో రెండు లక్షల 65 వేల మంది వలంటీర్లు ఉండగా ఎన్నికలకు ముందు లక్ష మందికిపైగా రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో లక్షా 67 వేల మంది వలంటీర్లు ఉన్నట్లు అంచనా. ఏపీ ప్రభుత్వ పథకాల పేరు మార్పు, తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాలుగా మార్పు, మరిన్ని పథకాలకు కూడా 

ఎన్నికల్లో ఓటర్లను వలంటీర్లు ప్రభావితం చేస్తారనే ఆలోచనతో వైసీపీ, టీడీపీ వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశాయి. అయితే వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా ఉన్నారనే ఉద్దేశంలో ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన టీడీపీ వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచడంలో సక్సెస్ అయింది. ఆ తర్వాతే చంద్రబాబు వారికి తాము అధికారంలోకి వస్తే రూ.10 వేల జీతం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావొస్తున్న వలంటీర్ల వ్యవస్థపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఇక ఈ సిస్టమ్ ఉండదని అంతా భావించారు. అయితే తాజాగా మంత్రి వీరాంజనేయస్వామి ప్రకటనతో కొన్ని మార్పులతో వాలంటీర్ వ్యవస్థ కొనసాగనున్నట్లు తెలుస్తోంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif