AP Assembly Budget Session 2022: ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన, వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి, ఏపీ అభివృద్ధి పథంలో నడుస్తోందని తెలిపిన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
కరోనాతో దేశం, రాష్ట్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాయని తెలిపారు. ఏపీపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందని చెప్పారు. ప్రభుత్వానికి ఉద్యోగులు మూల స్తంభాలని అన్నారు. అందుకే ఉద్యోగుల వయోపరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచామని తెలిపారు.
Amaravati, Mar 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తొలిసారిగా అసెంబ్లీలో బడ్జెట్‌పై (AP Assembly Budget Session 2022) ప్రసంగించేందుకు అసెంబ్లీకి రాగా ఏపీ సీఎం జగన్ (CM Jagan), ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్వాగతం పలికారు. ముందుగా జాతీయ గీతంతో సమావేశాలను ప్రారంభిన అనంతరం గవర్నర్ (Biswabhusan Harichandan) తన ప్రసంగాన్ని ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే ప్రతిపక్ష టీడీపీ (TDP) సభ్యులు నిరసనలు, నినాదాలు చేశారు.
రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాలని , రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్.గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఏపీ బడ్జెట్ ప్రతులను చింపివేశారు. ఏపీ సీఎం జగన్ తన అసహనం వ్యక్తం చేశారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన కొనసాగుతుందని అన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ మెరుగైన అభివృద్ధి సాధింస్తోందని తెలిపారు. పాలన కింది స్థాయి వరకు విస్తరించేలా గ్రామ సచివాలయాలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు.పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఏపీ అభివృద్ధి పథంలో నడుస్తోందని అన్నారు. గత మూడేళ్లుగా వికేంద్రీకరణ, సమ్మిళిత పాలన ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.
కొత్త జిల్లాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని చెప్పారు. కరోనాతో దేశం, రాష్ట్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాయని తెలిపారు. ఏపీపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందని చెప్పారు. ప్రభుత్వానికి ఉద్యోగులు మూల స్తంభాలని అన్నారు. అందుకే ఉద్యోగుల వయోపరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచామని తెలిపారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం మెరుగైన అభివృద్ధి సాధింస్తోందని గవర్నర్ తెలిపారు. పాలన కింది స్థాయి వరకు విస్తరించేలా గ్రామ సచివాలయాలు పని చేస్తున్నాయని కొనియాడారు.
గవర్నర్ ప్రసంగం అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా అసెంబ్లీ షెడ్యూల్‌ను ఖరారు చేస్తారు.బడ్జట్ సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. కాగా, సమావేశాలను ఈనెల 26 వరకు నిర్వహించే అవకాశం ఉన్నది.