All Bills Passed in AP Assembly: ఏపీ అసెంబ్లీలో అన్ని బిల్లులు మూజువాణి ఓటుతో పాస్, 3 రాజధానుల ఏర్పాటుకు మార్గం సుగమం, సీఆర్‌డీఏ చట్టం–2014 రద్దు బిల్లుకు ఆమోదం

ఏపీ శాసనసభ చరిత్రాత్మక బిల్లులను అమోదించింది. ఇందులో పరిపాలన వికేంద్రీకరణ – ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు–2020’, ‘సీఆర్‌డీఏ చట్టం–2014 రద్దు బిల్లు’లు (AP Capital Region Development Authority (CRDA) Act 2014) ఉన్నాయి. ఈ బిల్లులను శాసనసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీంతో రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు(Three capitals) ద్వారా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి మార్గం సుగమమైంది. ఈ బిల్లు ప్రకారం పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును నిర్ణయించింది.

CBI court exempts AP CM Jagan from appearance in illegal assets case | File Photo.

Amaravati, June 17: మొదటి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు (Ap Assembly) ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటుగా అన్ని రకాల బిల్లుల ఆమోదంతో (All Bills Passed in AP Assembly) ముగిసాయి. ఏపీ శాసనసభ చరిత్రాత్మక బిల్లులను అమోదించింది. ఇందులో పరిపాలన వికేంద్రీకరణ – ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు–2020’, ‘సీఆర్‌డీఏ చట్టం–2014 రద్దు బిల్లు’లు (AP Capital Region Development Authority (CRDA) Act 2014) ఉన్నాయి. ఏపీలో మూడు రాజధానులకు సై, ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందుతుందని ప్రసంగంలో తెలిపిన గవర్నర్, ప్రసంగాన్ని బహిష్కరించిన టీడీపీ

ఈ బిల్లులను శాసనసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీంతో రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు(Three capitals) ద్వారా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి మార్గం సుగమమైంది. ఈ బిల్లు ప్రకారం పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును నిర్ణయించింది.

కాగా గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన ఈ బిల్లులను శాసనసభ ఆమోదించి మండలికి పంపింది. ఈ బిల్లులను శాసనమండలిలో ప్రతిపక్ష టీడీపీ అడ్డుకుని ఆ బిల్లులను పరిశీలించేందుకు సెలక్ట్‌ కమిటీకి నివేదించాలని పట్టుబట్టింది. ఆ పరిణామాల తరువాత మళ్లీ ఇప్పుడు బడ్జెట్‌ సమావేశాల్లో ప్రభుత్వం ఆ రెండు బిల్లులను శాసనసభలో రెండోసారి ప్రవేశపెట్టి ఆమోదించింది.

మూజువాణి ఓటుతో ఆమోదం పొందిన బిల్లులు

1.పరిపాలన వికేంద్రీకరణ– ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు–2020’ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టగా, ‘సీఆర్‌డీఏ చట్టం–2014 రద్దు బిల్లు’ను పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ రెండు బిల్లులను శాసనసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.

2. ఏపీ పంచాయతీ రాజ్‌ చట్టం –1994 సవరణ బిల్లుకు ఆమోదం. ఏజెన్సీ పంచాయతీల్లో 100 శాతం సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలను ఎస్టీలకు రిజర్వు చేసేలా చట్ట సవరణకు ఈ బిల్లు తెచ్చారు. ప్రలోభాలు, అక్రమాలకు స్థానం లేకుండా పూర్తి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా తెచ్చిన మార్పులు కూడా బిల్లులో ఉన్నాయి.

3. ఏపీ విలువ ఆధారిత పన్ను చట్టం –2005 సవరణ బిల్లుకు ఆమోదం

4. జీఎస్టీ 38వ కౌన్సిల్‌ సమావేశంలో తీసుకున్న చట్ట సవరణ నిర్ణయం మేరకు రాష్ట్ర జీఎస్టీ చట్టాన్ని సవరిస్తూ తెచ్చిన బిల్లుకు ఆమోదం.

5. ఏపీ ఆబ్కారీ చట్టం–1968 సవరణ బిల్లుకు ఆమోదం.

6. అక్రమ మద్యం వ్యాపారం నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన ఏపీ మద్య నిషేధ చట్టం–1995 సవరణ బిల్లుకు ఆమోదం.

7. పురపాలక కార్పొరేషన్ల చట్టం– 1955, ఏపీ పురపాలికల చట్టం–1965 సవరణ బిల్లుకు ఆమోదం.

8. ఏపీ ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ తెచ్చిన బిల్లుకు ఆమోదం. విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణతోపాటు ప్రమాణాలు పాటించేలా కమిషన్‌ పర్యవేక్షిస్తుంది.

9.తిరుమల ఆలయం తలుపులు తెరిచి తొలి దర్శనం చేసుకొనే ‘సన్నిధి యాదవ్‌’కు వారసత్వ హక్కు కల్పిస్తూ దేవదాయ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం.

10. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌–జూన్‌ వరకు బడ్జెట్‌ కేటాయింపులకు వీలుగా ఆర్డినెన్స్‌ తెచ్చారు. ఈ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.

11. రాష్టంలో 8 దేవాలయాల ట్రస్టు బోర్డుల్లో నియామకాల్లో మార్పులు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లును సభ ఆమోదించింది.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif