AP Assembly Session 2022: దేశంలోనే నంబర్ వన్‌గా ఏపీ, కోవిడ్ ప్రభావం ఉన్నా ఏపీకి భారీగా పెట్టుబడులు, 11.43% గ్రోత్‌రేట్‌తో ఇతర రాష్ట్రాల కన్నా రాష్ట్రం మెరుగైన స్థితిలో ఉందని తెలిపిన సీఎం జగన్
సీఎం జగన్ పోలవరం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామిక అభివృద్ధిపై అసెంబ్లీలో సోమవారం చర్చ జరిగింది.
Amaravati, Sep 19: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మూడవ రోజు సమావేశాలు జరుగుతున్నాయి. సీఎం జగన్ పోలవరం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామిక అభివృద్ధిపై అసెంబ్లీలో సోమవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. మూడేళ్లలో 99 భారీ పరిశ్రమలు రాష్ట్రంలో ఉత్పత్తిని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.
భారీ పరిశ్రమల ద్వారా 46,280కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. వీటి ద్వారా రాష్ట్రంలో 62వేల 541 మందికి ఉపాధి లభించిందని వెల్లడించారు. మరో 40వేల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయన్నారు. మరో నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్మాణ దశలో ఉన్నట్లు సీఎం జగన్ వివరించారు.
'గడిచిన మూడేళ్లో అభివృద్ధి దిశగా అనేక అడుగులు పడ్డాయి. బల్క్ డ్రగ్స్ కోసం దేశంలో 17 రాష్ట్రాలు పోటీపడ్డాయి. 17 రాష్ట్రాలతో పోటీ పడి బల్క్‌డ్రగ్స్ పార్క్ సాధించాం. బల్క్‌డ్రగ్ పార్క్ వద్దని చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుతో 30వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. బల్క్‌డ్రగ్ పార్క్ వల్ల ఎలాంటి పొల్యూషన్ ఉండదు. గతంలో దివీస్ ఫార్మా వచ్చినపుడు చంద్రబాబుకు పొల్యూషన్ గుర్తురాలేదా?. నిబంధనల ప్రకారం పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. బల్క్‌డ్రగ్ పార్క్ మాకు ఇవ్వలేదని కేంద్రాన్ని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై మహారాష్ట్ర సీఎం కూడా కేంద్రాన్ని ప్రశ్నించారు.
పారిశ్రామిక ప్రగతి చంద్రబాబు హయాంలో కంటే ఇప్పుడు బాగుంది. వరుసగా మూడో ఏడాది ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ నంబర్ వన్. గతం కంటే అధికంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. ప్రభుత్వ విధానాలపై పారిశ్రామిక వేత్తలు సంతృప్తిగా ఉన్నారు. ఎంఎస్‌ఎంఈ రంగానికి ప్రభుత్వం అండగా ఉంటోంది. ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.2,500 కోట్ల ఇన్సెంటివ్‌లు ఇచ్చాం. చిన్న తరహా పరిశ్రమలను పోత్రహిస్తున్నాం. ఎంఎస్‌ఎంఈ రంగం ద్వారా 12లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాం. చంద్రబాబు ఎగ్గొట్టిన బకాయిలను ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది. లక్షల మందికి ఉపాధినిచ్చే ఎంఎస్‌ఎంఈని బాబు కూల్చేశారు. మా ప్రభుత్వ చర్యలతో పారిశ్రామిక రంగం నిలదొక్కుకుంది. యువతలో స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాం.
గ్రనైట్ పరిశ్రమలకు కూడా పోత్సాహకాలు ప్రకటించాం. ప్రభుత్వంపై పారిశ్రామిక వేత్తలకు భరోసా పెరిగింది. గతంలో దేనికైనా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు పారదర్శకంగా పనులు జరుగుతున్నాయి. చంద్రబాబులా మేం అవాస్తవాలను ప్రచారం చేయడం లేదు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వంపై విశ్వాసం పెరిగింది. సెంచురీ ఫ్లైవుడ్, సన్‌ఫార్మా, బిర్లా, అదానీ, ఆదిత్య మిట్టల్ వంటి దేశంలో ప్రఖ్యాతి గాంచిన సంస్థలు ఏపీకి వస్తున్నాయి. కరోనా సంక్షోభంలో కూడా ఏపీ ప్రభుత్వం నిలదొక్కుకుంది. మంచి పనితీరుతో ఇతర రాష్ట్రాలకంటే మెరుగైన స్థానంలో ఉంది. 11.43% గ్రోత్‌రేట్‌తో దేశంలోనే ఏపీ నంబర్ వన్‌స్థానంలో ఉంది అని సీఎం జగన్ పేర్కొన్నారు.
అన్ని రంగాలపై కోవిడ్ ప్రభావం ఉన్నా ఏపీకి భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఏటా సగటున మెరుగైన పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. చంద్రబాబు హయాంలో సగటున రూ.11,94 కోట్ల పెట్టుబడులు వస్తే ఈ మూడేళ్లలో సగటున రూ.12,702 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కాకినాడలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుతో 30వేల మందికి ఉపాధి. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై అడుగులు వేగంగా పడుతున్నాయి. రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్‌లను అభివృద్ధి చేస్తున్నాం. విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు, హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌ల అభివృద్ధి.