AP Assembly Session 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాల ముహూర్తం ఖరారు.. ఈ నెల 11 నుంచి సభ ప్రారంభం.. కనీసం పదిరోజుల పాటు సమావేశాలు

నవంబరు 11 నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌ ను ప్రవేశపెట్టనుంది.

AP Assembly (Photo-X)

Vijayawada, Nov 3: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు (AP Assembly Session 2024) ముహూర్తం ఖరారైంది. నవంబరు 11 నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. టీడీపీ (TDP) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌ ను ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, జూన్‌ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకూ పూర్తిస్థాయి బడ్జెట్‌ ను ప్రవేశపెట్టలేదు. ఓటాన్ అకౌంట్‌ తోనే ప్రభుత్వం నెట్టుకొస్తున్నది. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఈ నెలాఖరుతో ముగియనుండగా.. పూర్తిస్థాయి బడ్జెట్‌ ను ప్రవేశపెతతాల్సిన అవసరం ఏర్పడింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజునే అంటే 11నే ఈ బడ్జెట్ ఉంటుంది. ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ ను సభలో ప్రవేశపెట్టనుంది. కనీసం పదిరోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. బడ్జెట్‌ తోపాటు ఇతర బిల్లులను సభ ముందుకు తీసుకురానున్నట్టు సమాచారం.

వేంకటేశ్వరస్వామి ఆలయంలో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన స్వామి వారి పల్లకి, ఉత్సవ పీటలు.. పూర్తిగా కాలిపోయిన అద్దాల మండపం.. అరిష్టం అంటున్న వేద పండితులు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)

6న మంత్రివర్గం సమావేశం

నవంబర్‌ 6న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోన్న కూటమి ప్రభుత్వం.. దీపావళి రోజున ఉచిత సిలిండర్ పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్.. అప్రమత్తమైన ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది.. ఆలస్యంగా విమానాలు