IPL Auction 2025 Live

AP Budget 2023: రూ.2 లక్షల 79వేల 279 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్‌, అమ్మ ఒడికి రూ.6,500 కోట్లు, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక​కు రూ.21,434.72 కోట్లు, వార్షిక బడ్జెట్‌ హైలెట్స్ ఇవిగో..

అన్ని వర్గాల సంక్షేమంతో పాటు సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం జనరంజక బడ్జెట్‌ను గురువారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. 2023–24 ఆర్థిక ఏడాదికి మొత్తం రూ.2 లక్షల 79వేల 279 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ శాసనసభలో ప్రవేశ పెట్టారు.

Buggana rajendranath (Photo-Video Grab)

VJY. Mar 16: అసెంబ్లీలో 2023-24 ఏపీ వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల సంక్షేమంతో పాటు సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం జనరంజక బడ్జెట్‌ను గురువారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. 2023–24 ఆర్థిక ఏడాదికి మొత్తం రూ.2 లక్షల 79వేల 279 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ శాసనసభలో ప్రవేశ పెట్టారు. మూడో రోజు సమావేశాల్లో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ను అడ్డుకోవడం సరికాదన్నారు.

ఆగని జగన్ దూకుడు, 4 ఎమ్మెల్సీ స్థానాల్లో ఘన విజయం, గోదావరి జిల్లాల్లో రెండు స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీ

ఇష్టం లేకుంటే సభ నుంచి వాకౌట్‌ చేయాలని స్పీకర్‌ సూచించారు. బడ్జెట్‌కు పదేపదే అడ్డు తగలడంతో ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్‌ సస్సెండ్‌ చేశారు.బడ్జెట్‌లో పోతన భగవత పద్యాన్ని మంత్రి బుగ్గన చదివి వినిపించారు. టీడీపీ నేతలు సభకు అడ్డు తగలడంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ ప్రసంగాన్ని రాష్ట ప్రజలంతా చూస్తున్నారని, టీడీపీ అడ్డుపడటం సరికాదన్నారు.

ఏపీ వార్షిక బడ్జెట్‌ హైలెట్స్ ఇవిగో..

రెవిన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు

​​​​​​​►మూలధన వ్యయం రూ.31,061 కోట్లు

​​​​​​​►రెవిన్యూ లోటు రూ.22,316 కోట్లు

​​​​​​​►ద్రవ్య లోటు రూ.54,587 కోట్లు

​​​​​​​►జీఎస్డీపీలో రెవిన్యూ లోటు 3.77 శాతం

​​​​​​​►ఏపీ ద్రవ్యలోటు 1.54 శాతం

2023 బడ్జెట్‌ కేటాయింపులు..

►అమ్మ ఒడి రూ.6,500 కోట్లు

►వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక​‍- రూ.21,434.72 కోట్లు

►వైఎస్సార్‌ రైతు భరోసా రూ.4,020 కోట్లు

►మొత్తంగా డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు

►ధర స్థిరీకరణ నిధి రూ.3,000 కోట్లు

►వ్యవసాయ యాంత్రీకరణ రూ. 1,212 కోట్లు

►జగనన్న విద్యాదీవెన రూ.2,841.64 కోట్లు

►జగనన్న వసతి దీవెన- రూ.2,200 కోట్లు

►వైఎస్సార్‌- పీఎం బీమా యోజన- రూ.1600 కోట్లు

►డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు

►రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు

►వైఎస్సార్‌ కాపు నేస్తం- రూ. 550 కోట్లు

►జగనన్న చేదోడు రూ.350 కోట్లు

►వైఎస్సార్‌ వాహనమిత్ర రూ.275 కోట్లు

►వైఎస్సార్‌ నేతన్న నేస్తం రూ.200 కోట్లు

►వైఎస్సార్‌ మత్స్యకార భరోసా రూ.125 కోట్లు



సంబంధిత వార్తలు

Ambati Rambabu: అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయరా ? పోలీసులకు సూటి ప్రశ్న విసిరిన వైసీపీ నేత అంబటి రాంబాబు

Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ఉభయసభలు వాయిదా, మణిపూర్ హింస, అదానీ గ్రూప్‌పై లంచం ఆరోపణలపై చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్

Parliament Winter Session Starting Today: నేటి నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు.. డిసెంబర్‌ 20 వరకు కొనసాగే అవకాశం.. వక్ఫ్‌ సహా 16 బిల్లులపై చర్చ.. అదానీ, మణిపూర్‌ అంశాలపై ఉభయసభల్లో వాడీవేడీ యుద్ధం

Rains in AP: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఎల్లుండి నుంచి ఏపీలో భారీ వర్షాలు.. మూడు రోజుల పాటు సముద్రంలో అలజడి.. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని అధికారుల హెచ్చరికలు