AP Budget Highlights: రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌, ఏ శాఖకు ఎంత కేటాయించారో పూర్తి వివరాలు ఇవిగో, వ్యవసాయ రంగానికి రూ.48 వేల కోట్లు

ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavual Keshav) 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Andhra Pradesh govt presents Rs 3.22 lakh crore budget for 2025-26

Andhra Pradesh Budget 2024-25: ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavual Keshav) 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.48వేల కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా అంచనా వేశారు.

సూపర్ సిక్స్ హామీల అమలు బడ్జెట్ ఇదిగో, పోలవరం ప్రాజెక్టు కోసం బడ్జెట్‌లో రూ.6,705 కోట్లు, వ్యవసాయ రంగానికి పెద్ద పీట

బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం పయ్యావుల మాట్లాడుతూ.. మరో సూపర్ సిక్స్ హామీ అమలు చేసే దిశగా తల్లికి వందనం కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. 2025-26 విద్యా సంవత్సరం నుంచి చదువుకునే ప్రతి విద్యార్ధికి ఏడాదికి రూ.15 వేలు అందిస్తాం. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు, ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో చదుకునే పిల్లలకు ఈ పధకం వర్తిస్తుందన్నారు. విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులను ప్రభుత్వం జమచేయనుంది. స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు కేటాయించారు.

ఏపీ బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా

నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు రూ.1,228 కోట్లు

పాఠశాల విద్యాశాఖకు రూ.31,805 కోట్లు

ఉన్నత విద్యకు రూ.2,506 కోట్లు

ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు

ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు

బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు

అల్పసంఖ్యాక వర్గాల కోసం రూ.5,434 కోట్లు

మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం రూ.4,332 కోట్లు

వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి రూ.19,264 కోట్లు

పంచాయతీ రాజ్‌ శాఖకు రూ.18,847 కోట్లు

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.13,862 కోట్లు

గృహ నిర్మాణ శాఖకు రూ.6,318 కోట్లు

జలవనరుల శాఖకు రూ.18,019 కోట్లు

పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,156 కోట్లు

ఇంధన శాఖకు రూ.13,600 కోట్లు

ఆర్‌అండ్‌బీకి రూ.8,785 కోట్లు

యువజన, పర్యటక, సాంస్కృతిక శాఖకు రూ.469 కోట్లు

గృహ మంత్రిత్వ శాఖకు రూ.8,570 కోట్లు

తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం రూ.10 కోట్లు

మద్యం, మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమానికి రూ.10 కోట్లు

జల్‌ జీవన్‌ మిషన్‌ కోసం రూ.2,800 కోట్లు

వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు

పౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు

తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు (2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు)

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల కోసం రూ.27,518 కోట్లు

ఆర్టీజీఎస్‌ కోసం రూ.101 కోట్లు

దీపం 2.0 పథకానికి రూ.2,601 కోట్లు

మత్స్యకార భరోసాకు రూ.450 కోట్లు

స్వచ్ఛాంధ్ర కోసం రూ.820 కోట్లు

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ.3,486 కోట్లు

ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Jos Buttler: చాంపియన్స్ ట్రోఫీ ఫెయిల్యూర్, ఇంగ్లండ్‌ కెప్టెన్సీకి జోస్‌ బట్లర్‌ రాజీనామా, తదుపరి కెప్టెన్ ఎవరనేదానిపై కొనసాగుతున్న సస్పెన్స్

CM Revanth Reddy: రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వల్లే రాష్ట్రానికి ప్రాజెక్టులు రావడంలేదని మండిపాటు

Telangana: హైదరాబాద్-బెంగళూరును డిఫెన్స్ ఇండస్ట్రీయల్ కారిడార్‌‌గా ప్రకటించండి, రక్షణమంత్రి రాజనాథ్ సింగ్‌ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి

YSRCP Reaction on AP Budget: బడ్జెట్‌పై వైఎస్సార్‌సీపీ రియాక్షన్‌, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపాటు, ఈ బడ్జెట్‌తో ఎవరికీ ప్రయోజనం లేదని వెల్లడి

Share Now