AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ స‌మావేశం, ద‌స‌రా, దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు తీపి క‌బురు అందించే దిశగా నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం

సచివాలయంలో ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) అధ్యక్షతన జరిగే సమావేశానికి కూటమిలోని టీడీపీ(TDP), బీజేపీ(BJP), జనసేనకు(Janasena) చెందిన మంత్రులు హాజరుకానున్నారు.

Andhra Pradesh Cabinet Meeting

Vijayawada, OCT 09: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మంత్రి వర్గ సమావేశం(AP cabinet ) గురువారం అత్యవసరంగా సమావేశం అవుతుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) అధ్యక్షతన జరిగే సమావేశానికి కూటమిలోని టీడీపీ(TDP), బీజేపీ(BJP), జనసేనకు(Janasena) చెందిన మంత్రులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఏపీ ప్రజలకు దసరా (Dussehra) కానుకగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన ముఖ్యమంతి ఈ ప్రతిపాదనపై మంత్రివర్గం నిర్ణయం (AP Cabinet Decisions) తీసుకోనుంది.

Andhra Pradesh Politics: వీడియో ఇదిగో, టీడీపీలో చేరిన మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు 

అదేవిధంగా చంద్రబాబు ఢిల్లీలో రెండురోజుల పాటు పర్యటించి ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, అమిత్‌ షా, నిర్మలా సీతారామన్‌, కుమారస్వామి తదితరులతో చర్చించిన అంశాలు, కేంద్రం సానుకూలతను సమావేశంలో వివరించనున్నారు.

Andhra Pradesh Shocker: ఏలూరులో ఘోర విషాదం, పందెంకోడికి ఈత నేర్పిస్తూ చెరువులో పడి తండ్రితో పాటు ఇద్దరు కుమారులు మృతి 

రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో సభ్యుల సంఖ్యను 15 నుంచి 17కు పెంచుతూ చట్ట సవరణ, దేవాలయాల పాలక మండళ్ల ప్రకటనపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై కేబినెట్‌ చర్చించనుంది.