AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ మీటింగ్, మొత్తం 55 అంశాలపై కొనసాగిన భేటీ, జగనన్న సురక్ష అమలుపై ప్రముఖంగా ప్రస్తావన

సచివాల­యం మొదటి బ్లాకులోని కేబినెట్‌ సమావేశ మం­దిరంలో ఈ భేటీ జరిగింది. పలు కీలక నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

CM YS Jagan (Photo-AP CMO Twitter)

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్ష­తన బుధవారం రాష్ట్ర కేబినెట్‌ సమావేశం ముగిసింది. సచివాల­యం మొదటి బ్లాకులోని కేబినెట్‌ సమావేశ మం­దిరంలో ఈ భేటీ జరిగింది. పలు కీలక నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

మూడున్నర గంటలపాటు 55 అంశాలపై ఈ భేటీ సాగినట్లు తెలుస్తోంది. అలాగే.. ఎస్‌ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలపడంతో పాటు రాష్ట్రంలో పలు పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు, భూ కేటాయింపులు రాష్ట కేబినెట్‌ చేసింది. అలాగే.. అసైన్‌మెంట్‌ ల్యాండ్‌ విషయంలో, నిరుపేదలకు ఇచ్చిన ల్యాండ్‌ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

స్థానిక ఉద్యోగాలపై జగన్ సర్కారు కీలక నిర్ణయం, ప్రైవేటు కంపెనీల్లో స్థానికులే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశాలు

ఇక జగనన్న సురక్ష అమలుపైనా కేబినెట్‌ భేటీలో ప్రస్తావనకు రాగా.. అద్భుతమైన ఫలితాలపై సీఎం జగన్‌ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘‘ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు అక్కడికక్కడే సచివాలయాలు ద్వారా అందిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు’’ అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.