CM Jagan Davos Tour: ఐటీ హబ్‌గా విశాఖపట్నం, ఇదే జగన్ సంకల్పమని తెలిపిన టెక్‌ మహీంద్రా సీఈఓ, ఎండీ సీపీ గుర్నానీ, విద్యారంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్న దస్సాల్ట్‌

విశాఖపట్నాన్ని మేజర్‌ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి జగన్‌ సంకల్పంతో ఉన్నారని చెప్పారు. ఇక్కడ నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాలని టెక్‌ మహీంద్రాను సీఎం కోరారని తెలిపారు. దీనికి గాను ఆంధ్రా వర్శిటీతో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు టెక్‌ మహీంద్రా చైర్మన్‌ వెల్లడించారు

Jagan Met With Tech Mahindra CEO CP Gurnani (Photo-AP CMO)

Amaravati, May 23: ఏపీ సీఎం జగన్ దావోస్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సు రెండో రోజు ఏపీ సీఎం (AP Chief Minister Jagan)పలువురు ప్రముఖులతో వరుసగా సమావేశం అవుతున్నారు. రెండో రోజు ఉదయం సెషన్‌లో ఫ్యూచర్‌ ప్రూఫింగ్‌ హెల్త్‌ సిస్టమ్‌పై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన ఆ తర్వాత దస్సాల్ట్‌ సిస్టమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫ్లోరెన్స్‌ వెర్జలెన్‌, టెక్‌ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీలతో భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాల పెంపు అంశాలపై ప్రధానంగా చర్చించారు.

సీఎం జగన్‌‌తో భేటీ అనంతరం దస్సాల్ట్‌ సిస్టమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫ్లోరెన్స్‌ వెర్జలెన్‌ (Dassault Systems Vice President Versace) మాట్లాడుతూ... ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో సానుకూల వాతావరణంలో సమావేశం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా నైపుణ్యాలను ఎలా అభివృద్ధిచేయాలన్నదానిపై చర్చ జరిగినట్టు తెలిపారు. అదే విధంగా కొత్త తరహా ఇంధనాలపైనా కూడా సమావేశంలో చర్చించామన్నారు. విద్యారంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దస్సాల్ట్‌ ఉత్సాహంగా ఉందని ఆమె తెలిపారు.

ఏపీలో వైద్యరంగం అత్యుత్తమంగా ఉంది, దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్‌ పబ్లిక్‌ సెషన్‌లో ఏపీ సీఎం జగన్, ప్రజల ఆరోగ్య పరిరక్షణ మా ధ్యేయం అని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

ఇక టెక్‌ మహీంద్రా సీఈఓ, ఎండీ సీపీ గుర్నానీతో (Tech Mahindra CEO CP Gurnani ) సీఎం సమావేశం అయ్యారు. ఐటీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఇక్కడి మానవ వనరుల లభ్యత తదితర అంశాలపై వారు చర్చలు జరిపారు. సమావేశం ముగిసిన తర్వాత సీపీ గుర్నానీ మాట్లాడుతూ.. విశాఖపట్నాన్ని మేజర్‌ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి జగన్‌ సంకల్పంతో ఉన్నారని చెప్పారు. ఇక్కడ నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాలని టెక్‌ మహీంద్రాను సీఎం కోరారని తెలిపారు.

Here's CM Jagan Davos Tour Updates

దీనికి గాను ఆంధ్రా వర్శిటీతో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు టెక్‌ మహీంద్రా ఎండీ వెల్లడించారు. మానవ నైపుణ్యాలను పెంచేందుకు, హైఎండ్‌ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో ఆంధ్ర యూనివర్శిటీతో కలిసి ప్రత్యేక పాఠ్యప్రణాళికను రూపొందిస్తామన్నారు అదే విధంగా ఆర్టిఫియల్‌ ఇంలెటిజెన్స్‌కు ప్రధాన కేంద్రంగా విశాఖపట్నాన్ని తీర్చిద్దాలనే సంకల్పంతో సీఎం జగన్‌ ఉన్నట్టు గుర్నానీ వెల్లడించారు.

Here's CM Jagan Davos Tour Updates

దావోస్‌లో జరుగుతున్న సమావేశాల ద్వారా భారీ ఎత్తున పెట్టుబడులు సాధించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా సదస్సు రెండో రోజు సీఎం పలువురు ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. జపాన్‌కు చెందిన ప్రముఖ రవాణా సంస్థ మిట్సుయి ఒ.ఎస్‌.కె.లైన్స్‌ లిమిటెడ్‌ సీఈఓ తకేషి హషిమొటోతో సీఎం జగన్‌ భేటీ కానున్నారు. అదే విధంగా హీరోమోటార్‌ కార్పొరేషన్‌ చైర్మన్ ఎండీ పవన్‌ ముంజల్‌తోనూ జగన్‌ సమావేశం కానున్నారు. చివరగా ఐబీఎం చైర్మన్, సీఈఓ అరవింద్‌ కృష్ణతోనూ సీఎం జగన్‌ చర్చలు జరపనున్నారు. ఇంకా మరింత మంది ప్రముఖులనూ ఆయన కలిసే అవకాశం ఉంది.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif