IPL Auction 2025 Live

Land Resurvey in AP: వైఎస్సార్‌– జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం..తక్కెళ్లపాడులో సరిహద్దు రాయిను పాతి భూ రీసర్వేకు శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం వైయస్ జగన్

తెలంగాణ సరిహద్దు గ్రామం జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడులో సరిహద్దు రాయిను పాతి భూ రీసర్వేకు (Land Resurvey in AP) శ్రీకారం చుట్టారు. అనంతరం రీ సర్వే కోసం సిద్ధం చేసిన డ్రోన్స్‌ను ప్రారంభించి, సర్వే కోసం వినియోగించే పరికరాలను పరిశీలించారు. ఈ నెల 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రీ సర్వే ప్రారంభం కానుంది.

CM YS jagan Review Meeting (Photo-Twitter)

Amaravati, Dec 21: వైఎస్సార్‌– జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ సరిహద్దు గ్రామం జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడులో సరిహద్దు రాయిను పాతి భూ రీసర్వేకు (Land Resurvey in AP) శ్రీకారం చుట్టారు. అనంతరం రీ సర్వే కోసం సిద్ధం చేసిన డ్రోన్స్‌ను ప్రారంభించి, సర్వే కోసం వినియోగించే పరికరాలను పరిశీలించారు. ఈ నెల 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రీ సర్వే ప్రారంభం కానుంది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 16 వేల మంది సర్వేయర్లతో భూ రీసర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. సర్వేయర్లందరికీ అత్యాధునిక టెక్నాలజీతో సర్వే ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో శిక్షణా అందించామన్నారు. చదవండి: ఏపీలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం

‘భూములపై వివాదాలు, సృష్టించే బ్రోకర్లు, రౌడీల నుంచి రక్షణ అవసరం. పాదయాత్రలో అనేకమంది బాధితుల కష్టాలు విన్నా. సూమారు వందేళ్ల తర్వాత మళ్లీ సమగ్ర భూ సర్వే చేపడుతున్నాం. మీ భూమి రక్షణకు.. మా ప్రభుత్వం రక్షణ ఇస్తుంది. భూ రీసర్వేపై ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోంది. ఈ పరిస్థితిని మార్చేందుకే భూహక్కు-భూరక్ష పథకం. భూమిపై మీ హక్కును ఎవరూ మార్చలేరు. రైతులకు మరింత భద్రత కలగాలన్నదే మా లక్ష్యం. ప్రభుత్వ హామీతో కూడిన భూహక్కు పత్రాన్ని యజమానికి అందిస్తాం. భూమి విస్తీర్ణంతో కూడిన ల్యాండ్‌ మ్యాప్‌ను కూడా అందిస్తాం. ప్రతి గ్రామానికి సర్వే మ్యాప్‌ ఉంటుంది. గ్రామాల్లోనే రిజిస్ట్రేషన్లు చేసే విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని తెలిపారు.

మూడు విడతల్లో 1.26 కోట్ల హెక్టార్లలో సమగ్ర భూ సర్వే (YSR Jagananna Permanent Land Rights and Land Protection Scheme) జరగనుంది. మొదటి దశలో 5వేల గ్రామాల్లో భూ రీసర్వే ప్రారంభం కానుంది. రెండో దశలో 6,500 గ్రామాలు, మూడో దశలో 5,500 గ్రామాల్లో భూ రీసర్వే చేపట్టనున్నారు. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే పైలట్‌ ప్రాజెక్టుగా చేసిన ఈ గ్రామం రాష్ట్రవ్యాప్త రీసర్వేకి ఆదర్శంగా నిలిచింది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో (takkellapadu) దేశంలోనే తొలిసారిగా కంటిన్యూస్‌ ఆపరేటింగ్‌ రిసీవింగ్‌ స్టేషన్‌ (కోర్స్‌) నెట్‌వర్క్‌ ద్వారా డ్రోన్లను ఉపయోగించి రీసర్వేకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం 11 ప్రత్యేక బృందాలు 31 రోజులపాటు శ్రమించాయి.

Here's YSRCP Tweet

రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణలో భాగంగా వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్ని అప్‌డేట్‌ చేసి తొలుత గ్రామ సరిహద్దుల గుర్తింపు చేపట్టారు. గల్లంతైన 102 సరిహద్దురాళ్లు వేశారు. రెండోదశలో 86 సర్వే నంబర్లలో ఉన్న 272.52 ఎకరాల ప్రభుత్వ భూములను, మూడోదశలో 221 సర్వే నంబర్లలో ఉన్న 1,266.45 ఎకరాల ప్రైవేటు భూములను సర్వేచేసి హద్దులు గుర్తించారు. చివరగా గ్రామంలో ఉన్న ఆలయాలు, ప్రభుత్వ భవనాలు, ఇళ్లు, ప్రైవేటు ఆస్తులు సర్వే చేశారు.

గుర్తించిన వ్యత్యాసాలకు సంబంధించిన 9 (2) నోటీసులపై 147 అప్పీళ్లు వచ్చాయి. వీటిలో 112 అప్పీళ్లను పరిష్కరించారు. మిగిలిన కేసులను పరిష్కరించి 10వ తేదీన ఫైనల్‌ పబ్లికేషన్‌ జారీచేశారు. కొత్తగా రూపొందించిన గ్రామ మ్యాప్, ఎఫ్‌ఎంబీ, ఆర్‌ఎస్‌ఆర్, అడంగల్, ఐబీ, ప్రభుత్వ భూముల రిజిష్టర్లను నేడు (సోమవారం) ప్రకటిస్తారు. భూ యజమానులకు కొత్త పాస్‌పుస్తకాలు జారీచేస్తారు. కొత్త సర్వే రాళ్లు పాతుతారు.

ఏపీ సీఎం వైయస్ జగన్ పుట్టినరోజు, ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు, నేను విన్నాను..నేను ఉన్నాను అంటూ ప్రజా పాలనలో దూసుకుపోతున్న యువనేత

ఎఫ్‌ఎంబీ ప్రకారం 6.04 శాతం, అడంగల్‌ ప్రకారం 11.25 శాతం వ్యత్యాసం ఉన్నట్లుగా గుర్తించారు. సబ్‌ డివిజన్ల ప్రకారం అత్యధికంగా 2.10 ఎకరాలు, అత్యల్పంగా 0.01 ఎకరాలు, అడంగల్‌ ప్రకారం అత్యధికంగా 3.73 ఎకరాలు, అత్యల్పంగా 0.01 సెంట్ల తేడా ఉన్నట్లు నిర్ధారించారు. పాత ఆర్‌ఎస్‌ఆర్‌ ప్రకారం సర్వే నంబరు 97లో 1.46 ఎకరాలు ఎక్కువ, సర్వే నంబరు 125లో 0.80 ఎకరాలు తక్కువ ఉన్నట్టుగా గుర్తించారు. అడంగల్‌ ప్రకారం 3.73 ఎకరాలు తక్కువగా నమోదైనట్టుగా లెక్క తేల్చారు