Nara Devansh Set A Record In Chess: నారా దేవాన్ష్ టాలెంట్ కు ప్ర‌పంచం ఫిదా, 9 ఏళ్ల వ‌య‌స్సులోనే స‌రికొత్త రికార్డు సృష్టించిన నారావారి వార‌సుడు

చెక్‌మేట్‌ సాల్వర్‌-175 పజిల్స్‌ సాధించడంతో వరల్డ్‌బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లండన్‌ (London) నుంచి నారా దేవాన్స్‌ ధ్రువపత్రం సాధించారు. నారా దేవాన్ష్‌ రికార్డు సాధించడం పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.

Nara Devansh Set A Record In Chess

Vijayawada, DEC 22: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra Babu) మనవడు నారా దేవాన్ష్‌ (Nara Devansh ) చదరంగంలో (Chess) వేగంగా పావులు కదపడంలో రికార్డు సృష్టించాడు. చెక్‌మేట్‌ సాల్వర్‌-175 పజిల్స్‌ సాధించడంతో వరల్డ్‌బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లండన్‌ (London) నుంచి నారా దేవాన్స్‌ ధ్రువపత్రం సాధించారు. నారా దేవాన్ష్‌ రికార్డు సాధించడం పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా దేవాన్ష్‌ తండ్రి మంత్రి నారా లోకేష్‌ స్పందించారు. దేవాన్ష్‌ చెస్‌ను ఎంతో ఇష్టంగా స్వీకరించి, కొన్ని వారాలుగా ఈ రికార్డు కోసం శ్రమించాడని పేర్కొన్నారు. చదరంగంలో శిక్షణ ఇచ్చిన రాయ్‌ చెస్‌ అకాడమీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Telangana: భద్రాచలంలో 5.25 కిలోల బాల భీముడు జననం, ప్రభుత్వ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ..ఇది మూడో కాన్పు 

దేవాంశ్‌ లేజర్‌ షార్ప్‌ ఫోకస్‌తో శిక్షణ పొందడం ప్రత్యక్షంగా చూశానని, ఈ ఘనత పట్ల నారా లోకేశ్‌ (Nara Lokesh) హర్షం వ్యక్తం చేశారు. ‘‘దేవాంశ్‌ ఈ క్రీడను ఎంతో ఇష్టంగా స్వీకరించాడు. గ్లోబల్‌ అరేనాలో భారతీయ చెస్‌ క్రీడాకారుల అద్భుతమైన, చారిత్రాత్మక ప్రదర్శనల నుంచి ప్రేరణ పొందాడు. ఈ ఈవెంట్‌ కోసం గత కొన్ని వారాలుగా రోజుకు 5..6 గంటలు శిక్షణ పొందాడు. చెస్‌ పాఠాలు నేర్పిన రాయ్‌ చెస్‌ అకాడమీకి ధన్యవాదాలు’’ అని లోకేశ్‌ తెలిపారు.

Nara Devansh Set A Record In Chess

 

దేవాంశ్‌ సృజనాత్మకంగా చెస్‌ నేర్చుకునే ఒక డైనమిక్‌ విద్యార్థి అని కోచ్‌ కె.రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. 175 సంక్లిష్టమైన ఫజిల్స్‌ని ఆసక్తిగా పరిష్కరించగలిగిన మానసిక చురుకుదనం అతని సొంతమన్నారు. దేవాంశ్‌ చదరంగ ప్రయాణంలో ఇదొక మైలురాయి అని వెల్లడించారు.



సంబంధిత వార్తలు

Nara Devansh Set A Record In Chess: నారా దేవాన్ష్ టాలెంట్ కు ప్ర‌పంచం ఫిదా, 9 ఏళ్ల వ‌య‌స్సులోనే స‌రికొత్త రికార్డు సృష్టించిన నారావారి వార‌సుడు

Andhra Pradesh Shocker: కొడుకును సుపారీ ఇచ్చి హత్య చేయించిన తండ్రి, కొడుకు వేధింపులు భరించలేక అడవిలోకి తీసుకెళ్లి మద్యం తాగించి హత్య...వీడియో

CM Revanth Reddy: సర్వమత సమ్మేళనంం తెలంగాణ, మత విద్వేషాలు రెచ్చగోడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి, క్రిస్టియన్ల సంక్షేమం- అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్న సీఎం

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif