Nara Lokesh: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన సీఎం చంద్రబాబు, నారా లోకేష్..ఏపీ మోడల్ విద్యావ్యవస్థను తయారుచేస్తామని నారా లోకేష్ వెల్లడి
రాష్ట్రవ్యాప్తంగా 45వేల పైచిలుకు పాఠశాలల్లో ఒకేరోజు తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించడం ఒక చరిత్ర అన్నారు.
Vij, Dec 7: బాపట్ల మున్సిపల్ హైస్కూలులో పండుగ వాతావరణంలో జరిగిన మెగా పేరెంట్ – టీచర్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో కలిసి హాజరుకావడం ఆనందంగా ఉందన్నారు మంత్రి నారా లోకేష్. రాష్ట్రవ్యాప్తంగా 45వేల పైచిలుకు పాఠశాలల్లో ఒకేరోజు తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించడం ఒక చరిత్ర అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ఏపీ మోడల్ విద్యావ్యవస్థను తయారుచేయడానికి మెగా పిటిఎం తొలి అడుగు అన్నారు. దీనిద్వారా ఉపాధ్యాయులు, టీచర్లు, తల్లిదండ్రుల మధ్య ధృడమైన బంధం ఏర్పడుతుందన్నారు. గత అయిదేళ్లలో గాడితప్పిన విద్యావ్యవస్థను గాడిలో పెట్టే బాధ్యత నాది అన్నారు.
ఇందులో భాగంగా రానున్న ఆరునెలల్లో రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టులను మెగా డిఎస్సీ ద్వారా భర్తీచేస్తాం. ఎన్నో సవాళ్లు నడుమ విద్యాశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన నేను చాలెంజ్ గా తీసుకుని వ్వవస్థను సరిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నాను అని చెప్పారు.
గతంలో పాఠశాలల్లో పార్టీ రంగులు, నాయకుల ఫోటోలు ఉండేవి, రాజకీయాలకు అతీతంగా విద్యాలయాలను తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో వాటన్నింటినీ తొలగించాం అన్నారు. ప్రభుత్వ పథకాలకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ లాంటి మహనీయులు పేర్లు పెట్టాం... తల్లిదండ్రులు తమ బిడ్డల పురోగతిని తెలుసుకుని లోపాలను సరిదిద్దుకోవడానికి వీలుగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను అందజేస్తున్నాము అన్నారు. తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్, కొత్త కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను 4స్టార్ రేటింగ్ చేర్చాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నాం. బాలబాలికలు సమానమేనన్న భావన కలిగించడంతోపాటు విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు గారి సలహాలతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రత్యేక పాఠ్యాంశాలు ప్రవేశపెడుతున్నాం. ఎపి మోడల్ విద్యావ్యవస్థను తయారు చేసేందుకు అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తమవంతు సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పారు.