Narendra Modi Cabinet

New Delhi, DEC 06: దేశంలో కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు (Kendriya Vidyalaya), 28 నవోదయ విద్యాలయాల (Navodaya Vidyalaya) ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణలో 8 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఏపీలోని అనకాపల్లి, వలసపల్లె (చిత్తూరు జిల్లా), పాలసముద్రం (సత్యసాయి జిల్లా), తాళ్లపల్లి (గుంటూరు), నందిగామ(కృష్ణా జిల్లా), రొంపిచర్ల(గుంటూరు), నూజివీడు (ఏలూరు జిల్లా), ఢోన్‌ (నంద్యాల జిల్లాలో) ప్రాంతాల్లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఇక తెలంగాణలో జగిత్యాల, నిజామాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో 7 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Telangana Thalli: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ఇదిగో, ఈనెల 9వ తేదీన సెక్రటేరియట్‌లో విగ్రహావిష్కరణ కార్యక్రమం 

దేశవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయబోయే 85 కేంద్రీయ విద్యాలయాల కోసం రూ.5872 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. ఇవి అందుబాటులోకి వస్తే ఒక్కో కేంద్రీయ విద్యాలయంలో 960 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఇక కొత్తగా 28 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు రూ.2359.82 కోట్ల వరకు ఖర్చు కానుంది. ఒక్కో నవోదయ విద్యాలయంలో 560 మంది విద్యార్థులకు అవకాశం దక్కనుంది.