Jagananna Vidya Kanuka: ఈ పిల్లల మేనమామగా ఎంతో సంతోషపడుతున్నా, జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్, ఏపీ ముఖ్యమంత్రి స్పీచ్ హైలెట్స్ ఇవిగో..

సోమవారం పల్నాడు జిల్లా క్రోసూర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగించారు.‘‘పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యాకానుక అందిస్తున్నాం. ప్రభుత్వ, ఎయిడెడ్‌ విద్యార్థులకు విద్యాకానుక కిట్లు ఇస్తున్నాం.

Andhra Pradesh CM YS Jagan Mohan Reddy. (Photo Credits: Twitter@AndhraPradeshCM)

నాలుగో ఏడాది జగనన్న విద్యా కానుకను సీఎం జగన్‌ అందించారు. స్కూళ్లు ప్రారంభమైన తొలిరోజే విద్యాకానుక అందజేశారు. క్రోసూరులో ఏపీ మోడల్‌ స్కూల్‌ను సందర్శించిన సీఎం జగన్‌ డిజిటల్‌ తరగతి గదులను పరిశీలించారు. క్లాస్‌రూమ్‌లో విద్యార్థులతో కూర్చొని ముచ్చటించారు. ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్‌పై ఆల్‌ ది బెస్ట్‌ అని రాశారు. జగనన్న విద్యాకానుక కిట్లను పరిశీలించారు.

జగనన్న విద్యాకానుక పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. సోమవారం పల్నాడు జిల్లా క్రోసూర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగించారు.‘‘పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యాకానుక అందిస్తున్నాం. ప్రభుత్వ, ఎయిడెడ్‌ విద్యార్థులకు విద్యాకానుక కిట్లు ఇస్తున్నాం. కిట్లలో మెరుగైన మార్పులు తెచ్చాం. ప్రతీ విద్యార్థికి మూడు జతల యూనిఫామ్‌, స్కూల్‌ బ్యాగ్‌, షూస్‌, సాక్సులు అందిస్తున్నాం. నోట్‌ బుక్స్‌, వర్క్‌ బుక్స​, బైలింగువల్‌ పాఠ్య పుస్తకాలు, డిక్షనరీలతో పాటు బ్యాగు సైజులు పెంచాం. యూనిఫామ్‌ డిజైన్‌లోనూ మార్పులు చేశాం అని తెలిపారాయన.

స్కూళ్లు ప్రారంభమైన తొలిరోజే విద్యాకానుక, నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుకను అందించిన సీఎం జగన్

ఈ ఒక్క పథకం మీదే ఈ నాలుగు ఏళ్లలో ఈ పిల్లల మేనమామ ప్రభుత్వం అక్షరాల రూ. 3,366 కోట్లు ఖర్చు చేశామని చెప్పడానికి గర్వపడతున్నాం అని సీఎం జగన్‌ చెప్పారు. వీళ్లు చిన్నారులు వీళ్లకు ఓటు హక్కు లేదు.. పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది గతం. కానీ, ఇవాళ వాళ్ల జగన్‌ మామ ప్రభుత్వంలో విద్యాకానుక ఓ పండుగలా జరుగుతోంది. ఒక ఎమ్మెల్యే దగ్గరి నుంచి ప్రతీ ప్రజాప్రతినిధులందరూ పిల్లలతో కలిసి ఈ పండుగలో పాల్గొంటుడడం.. ఆ పిల్లల మేనమామగా సంతోషపడుతున్నానని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

పేదపిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తే ఓర్వలేని బుద్ధి చంద్రబాబుదని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అన్నింట్లోనూ.. పేదల పట్ల వ్యతిరేకత బుద్ధి ప్రదర్శించాడని, అందుకు కారణం ఆయనలోని పెత్తందారీ మనస్తత్వమని చెప్పారు సీఎం జగన్‌. సోమవారం పల్నాడు క్రోసూర్‌లో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు తీరును సీఎం జగన్‌ ఏకిపారేశారు.

‘‘చంద్రబాబుకు మంచి చేయాలన్నది ఏనాడూ లేదు. గతంలో ఇది చూశాం. ఆయన 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నా కూడా.. ఏ ఒక్క మంచి, పథకం కూడా గుర్తుకు రాదు. చంద్రబాబు నాయుడు ఏ ఒక్క వర్గాన్ని కూడా వదకులండా ‘‘ఎన్నికలకు ముందు వాగ్ధానం చేశారు.. ఎన్నికల తర్వాత మోసం చేశాడ’’ని సీఎం జగన్‌ ఉద్ఘాటించారు. ఇది కళ్ల ముందు కనిపిస్తున్న సత్యమన్నారు.

గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా గుర్తించండి. అవినీతి, వివక్షకు తావులేకుండా నేరుగా లబ్ధి దారులకు సంక్షేమం అందించిన ప్రభుత్వం మనది. అక్కచెల్లెమ్మల దగ్గరి నుంచి అన్ని వర్గాలకూ లబ్ధి చేకూరుస్తున్నాం. మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని హామీలను అమలు చేస్తున్నాం. కానీ, చంద్రబాబు బతుకే మోసం, అబద్ధం, కుట్ర, వాగ్ధానాలు, వెన్నుపోటులు.  ఒక ఈనాడు, ఒక టీవీ5, ఒక ఆంధ్రజ్యోతి, ఒక దత్తపుత్రులు.. ఈ గజదొంగల ముఠా ఆయనకు అండగా వస్తోంది. మూసేయడానికి సిద్ధంగా ఉన్న టీడీపీ దుకాణంలో పక్కరాష్ట్రం నుంచి మేనిఫెస్టో తీసుకొచ్చి.. బిసిబిల్లాబాత్‌గా వండుతున్నారు. మనం చేసిన మంచిని, అందిస్తు‍న్న సంక్షేమ పథకాలను కిచిడీ, పులిహోరగా వండే ప్రయత్నం చేస్తున్నారు.

సీఎం అయిన 28 సంవత్సరాల తర్వాత.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత రాయలసీమ, బీసీ, ఎస్సీఎస్టీ డిక్లరేషన్‌లు అంటూ ఇవాళ మొదలుపెట్టారు. ఆ 14 సంవత్సరాలు ఏం గాడిదలు కాసావా చంద్రబాబు? అంటూ నిలదీశారు సీఎం జగన్‌. కేవలం ఎన్నికలప్పుడే వాగ్ధానాలు.. వెన్నుపోట్లతో చంద్రబాబు చట్రం నడుస్తోందని ఎద్దేవా చేశారు సీఎం జగన్‌.

చంద్రబాబునాయుడుగారి పెత్తందారీ వ్యవస్థకు X పేదల ప్రభుత్వానికి జరుగుతున్న యుద్ధం. డీపీటీ(దోచుకో, పంచుకో, తినుకో) భావజాలానికి X  లంచాలకు తావులేకుండా వివక్షకు చోటులేకుండా నేరుగా లబ్ధి అందిస్తున్న టీబీటీ సర్కార్‌కు జరుగుతున్న యుద్ధం. సామాజిక అన్యాయానికి X సామాజిక న్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధం. యెల్లో మీడియా విష ప్రచారానికి X ఇంటింటికీ జరిగిన మంచికీ మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధం.. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామ యుద్ధం.. ఇది జగన్‌పై జరుగుతున్న యుద్ధం కాదు.. పేదలపై జరుగుతున్న యుద్ధం.  మీ జగనన్నకు ఈనాడు తోడు లేదు, టీవీ 5 అండ లేదు, ఏబీఎన్‌ ఢంకా బజాయించడంలేదు, దత్తపుత్రుడు అసలే లేడు. మీ జగనన్నకు బీజేపీ అండగా ఉండకపోవచ్చు.. వీటినేం మీ జగనన్న నమ్ముకోలేదు.

విద్యార్థుల భవిష్యత్ కోసం ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం, ఈ తరం పిల్లలకు గ్లోబల్‌ చదువులు, నేటి నుంచి 17వ తేదీ వరకు ఒంటిపూట బడులు

మీ జగనన్న నమ్ముకుంది దేవుడి దయను. మీ చల్లని దీవెనలు. నా ధైర్యం మీరు. నా బలం ఇంటింటికి మన ప్రభుత్వం అందించిన మంచి అని చెప్పడానికి గర్వపడుతున్నా. మిమ్మల్ని కోరేది ఒక్కటే.. వాళ్ల దుష్ప్రచారాలను నమ్మకండి. ఈ ప్రభుత్వం ద్వారా మీ ఇంట్లో జరిగిన మంచే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. మంచి గెలుస్తుందని మనసారా నమ్ముతూ.. దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. పిల్లలు మంచిగా చదువుకుని విద్యావేత్తలుగా ఎదగాలని, మంచి నాయకులు కావాలని.. మీ అందరికీ మరింత మంచి చేసే అవకాశం ఇవ్వాలని  కోరుకుంటున్నా.