AP CM Jagan On Republic Day: ఏపీలో ఘనంగా గణతంత్ర వేడుకలు, రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకుందామని సీఎం జగన్ ట్వీట్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం తన సందేశాన్ని ట్వీట్ చేశారు.

YS Jagan Mohan Reddy (Photo/Twitter/APCMO)

స్వతంత్ర భారతాన్ని గణతంత్ర దేశంగా మార్చిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు నేడు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం తన సందేశాన్ని ట్వీట్ చేశారు.

నేటికి 73 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మన రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకుందాం.. వారి అడుగుజాడల్లో నడుద్దాం.. దేశాభివృద్ధికి పాటుపడదాం’ అని సీఎం ట్విట్టర్‌లో రాశారు.

ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో గురువారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ జెండాను ఆవిష్కరించి సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు.

సంక్షేమ పథకాలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించే పట్టికల ప్రదర్శనను ఆయన వీక్షించారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్‌ జగన్‌, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.