AP Cabinet Meet Highlights: ఆంధ్ర ప్రదేశ్‌లో సీఎం జగన్ వరాలు, చేనేత కుటుంబాలకు రూ. 24వేలు, మత్యకారులకు రూ.10వేలు, మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం, ముఖ్యాంశాలు ఇవే
24 వేలు ఆర్థిక సహాయం అందజేయాలని ఏపీ కేబినేట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలోని 90 వేల చేనేత కుటుంబాలు లబ్ది పొందనున్నాయి...
Amaravathi: రాష్ట్రంలోని చేనేత కార్మికుల సంక్షేమం కోసం నూతన పథకాన్ని అమలు చేయబోతున్న్మట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. చేనేత కార్మికుల కోసం 'వైఎస్ఆర్ నేతన్న హస్తం' (YSR Nethanna Hastham) కింద ప్రతీ చేనేత కుటుంబానికి ఏడాదికి రూ. 24 వేలు ఆర్థిక సహాయం అందజేయాలని ఏపీ కేబినేట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలోని 90 వేల చేనేత కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. ప్రతీ ఏడాది డిసెంబర్ 21న ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ పథకం కోసం ప్రభుత్వానికి ఏటా రూ. 216 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. సీఎం జగన్ దసరా కానుకలు..
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) అధ్యక్షతన బుధవారం జరిగిన ఏపి క్యాబినెట్ సమావేశం (AP Cabinet Meet) లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.
మంత్రివర్గ సమావేశంలోని ముఖ్యాంశాలు
వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ .10,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది. మరబోట్లే కాకుండా తెప్పలపై కూడా వేట సాగించే జాలర్లకు ఈ ఆర్థిక సహాయం వర్తించబడుతుంది.
మత్యకారులకు డీజిల్‌పై లీటరుకు రూ .9 సబ్సిడీని అందించాలని నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 21న మత్స్య దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోందని, ఆ రోజు నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని మంత్రి నాని తెలిపారు. మహారాష్ట్రలో 'రావాలి జగన్, కావాలి జగన్'
రాష్ట్రంలో హోమ్ గార్డ్ కార్మికుల వేతనాల పెంపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హోమ్ గార్డుల రోజువారీ జీతం రూ. 600 నుండి రూ.710 కి పెంచారు. దీంతో హోం గార్డుల వేతనం నెలకు రూ. 18,000 నుండి రూ. 21,300 కు చేరుతుంది.
మధ్యాహ్న భోజనం పథకం కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనం రూ. 1000 నుండి రూ. 3000 కు పెంచుతూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది.
బార్ అసోసియేషన్ లో సభ్యులుగా ఉన్న జూనియర్ న్యాయవాదులకు 5 వేల ప్రోత్సాహకాలు అందించాలని ఏపి కేబినెట్ నిర్ణయించింది. అదేవిధంగా, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల కోసం కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
జిల్లాల వారీగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతులకు ఉచితంగా బోర్లు వేసేందుకు డ్రిల్లింగ్ మిషన్ల కొనుగోళ్లకు కేబినేట్ నిర్ణయం తీసుకుంది.
ఏపీఎస్ ఆర్టీసీలో కాలం చెల్లిన 3500 పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేయాలని ఏపి కేబినేట్ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ, 1000 కోట్ల వరకు రుణం తీసుకునేలా ఆర్టీసీకి అనుమతులు మంజూరు చేసింది.