CM YS Jagan VC: ఏప్రిల్‌,మే నెలలో రాబోయే పథకాల వివరాలు ఇవే, ఏప్రిల్ 1న కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోనున్న ఏపీ సీఎం వైయస్ జగన్, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ముమ్మరంగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు

ఉపాధిహామీ పనులు, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్, 90 రోజుల్లో ఇంటిపట్టా, నాడు –నేడు, స్పందన, చేయూత, అర్బన్‌ ప్రాంతాల్లో మధ్యతరగతికి లాభాపేక్షలేకుండా సరసమైన ధరలకు ఇంటి స్థలాలు, కరోనా నివారణ తదితర అంశాలపై సీఎం (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) సమీక్ష జరిపారు. ఏప్రిల్, మే నెలల్లో అమలు చేయనున్న స్కీంలు, కార్యక్రమాలపైనా సీఎం సమీక్ష నిర్వహించారు.

CM YS jagan Review Meeting (Photo-Twitter)

Amaravati, Mar 30: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ (AP CM YS Jagan Mohan Reddy Video Conference) నిర్వహించారు. ఉపాధిహామీ పనులు, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్, 90 రోజుల్లో ఇంటిపట్టా, నాడు –నేడు, స్పందన, చేయూత, అర్బన్‌ ప్రాంతాల్లో మధ్యతరగతికి లాభాపేక్షలేకుండా సరసమైన ధరలకు ఇంటి స్థలాలు, కరోనా నివారణ తదితర అంశాలపై సీఎం (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) సమీక్ష జరిపారు. ఏప్రిల్, మే నెలల్లో అమలు చేయనున్న స్కీంలు, కార్యక్రమాలపైనా సీఎం సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్‌ నివారణపై అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1న తాను కూడా వ్యాక్సిన్‌ తీసుకుంటున్నానని తెలిపారు. కోవిడ్‌ సమస్యకు వ్యాక్సినేషనే పరిష్కారమన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను (Coronavirus Vaccination) ముమ్మరంగా చేపట్టాలన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కేవలం 6 రోజుల ప్రక్రియే మిలిగి ఉందని.. ఇది కూడా పూర్తయితే ఇక ఎన్నికలు ముగిసినట్టేనన్నారు. ఆ తర్వాత దృష్టి అంతా వ్యాక్సినేషన్‌ పైనేనని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

టీడీపీ అంతమయ్యే దినోత్సవం, బాబు మళ్లీ అధికారంలోకి రావడం కల మాత్రమే, పవన్ కళ్యాణ్ ఎక్కడ గెలిచి సీఎం అవుతాడు, తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

ఉపాధిహామీ పనులను రికార్డు స్థాయిలో చేపట్టారని అధికారులను అభినందించారు. ‘‘25.50 కోట్ల పని దినాలను కల్పించారు. రాష్ట్రంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. కోవిడ్‌ సమయంలో కూలీలను ఆదుకున్నారు. దేశంలోనే మూడో స్థానంలో ఉన్నాం. చిన్నరాష్ట్రమైనా మనం మూడో స్థానంలో ఉండడం గర్వకారణం. రూ. 5,818 కోట్లు నేరుగా కూలీలకు ఇవ్వగలిగాం. ఏప్రిల్, మే, జూన్‌ నెలలో కొన్నిరోజుల వరకూ పనులు ముమ్మరంగా చేసుకునేందుకు అవకాశం ఉన్న సమయం ఇది. ఇదే వేగంతో ఉపాధిహామీ పనులు ముమ్మరంగా జరగాలి. ఉపాధి హామీ పథకాన్ని కలెక్టర్లు ఓన్‌ చేసుకోవాలి. ప్రతి 4-5 రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా రివ్యూ చేయాలి. జాయింట్‌ కలెక్టర్లు కూడా ఉపాధిహామీ పథకంపై దృష్టిపెట్టాలని’’ సీఎం జగన్‌ అన్నారు.

ఏప్రిల్‌, మే నెలలో ప్రారంభించే పథకాలు, కార్యక్రమాలు వివరాలు

►ఏప్రిల్‌ 13న వాలంటీర్లకు సత్కారం

►ఏప్రిల్‌ 16న జగనన్న విద్యాదీవెన ప్రారంభం

►విద్యాదీవెన కింద నేరుగా తల్లుల అకౌంట్లలోకే నగదు

►ఏప్రిల్‌ 20న వైఎస్‌ఆర్‌ సున్నావడ్డీ పథకం ప్రారంభం

►రబీకి సంబంధించి రైతుల అకౌంట్లలోకి నేరుగా నగదు

►ఏప్రిల్‌ 23న వైఎస్‌ఆర్‌ సున్నావడ్డీ కింద డ్వాక్రా అక్కాచెల్లెమ్మల అకౌంట్లలోకి నగదు

►ఏప్రిల్‌ 28న జగనన్న వసతి దీవెన

►ఏడాదిలో మూడుసార్లు జగనన్న వసతి దీవెన

►మే 13న వైఎస్సాఆర్‌ రైతు భరోసా,

►మే 18న మత్స్యకార భరోసా,

► మే 25న ఖరీఫ్‌ బీమా

సీఎం వైఎస్‌ జగన్‌ రివ్యూ ముఖ్యాంశాలు

►గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్కులు తదితరవాటి భవన నిర్మాణాలు వేగంగా జరగాలి

►కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి, ఈ భవనాల నిర్మాణంపై పూర్తి దృష్టిపెట్టాలి

►గ్రామ సచివాలయాల నిర్మాణంలో నెల్లూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల కలెక్టర్లు దృష్టిపెట్టాలి:

►మిగతా జిల్లాలతో పోలిస్తే వెనకబడి ఉన్నాయి

►బేస్‌మెంట్‌ లెవల్, గ్రౌండ్‌ ఫ్లోర్, శ్లాబ్‌ లెవల్‌ స్థాయిలో కృష్ణా, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాలు పెండింగులో పనులు ఉన్నాయి. ఈ జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలి

►మే నాటికల్లా గ్రామ సచివాలయాల నిర్మాణం పూర్తి కావాలి

►రైతు భరోసా కేంద్రాల నిర్మాణంలో నెల్లూరు, అనంతపూర్, కృష్ణా జిల్లాలు మెరుగుపడాల్సి ఉంది

►అలాగే బేస్‌మెంట్‌ లెవల్, గ్రౌండ్‌ లెవల్, నెల్లూరు, కృష్ణా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పనులు పెండింగులో ఉన్నాయి

►జులై 8న వైఎస్సార్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభిస్తున్నాం

►ఖరీఫ్‌ ప్రారంభం సందర్భంగా ఆర్బీకేల ద్వారా రైతులకు తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది

►అందుకే పనులను చాలా ముమ్మరంగా పనులు చేయాల్సి ఉంది

►కోవిడ్‌ లాంటి మహమ్మారిని ఎదుర్కోవడానికి విలేజ్‌ క్లినిక్కులు ఆవశ్యకత ఉంది

►వీలైనంత త్వరగా వీటి పనులను పూర్తిచేయాల్సి ఉంది

►యుద్ద ప్రాతిపదికిన క్లినిక్స్‌ నిర్మాణం జరగాలి

►ఆగస్టు 15న వీటిని ప్రారంభించాలి

►అందుకే వేగంగా పనులు పూర్తిచేయాలి

►గ్రామస్థాయిలో ఆరోగ్యశ్రీ రిఫరెల్‌ పాయింట్‌గా విలేజ్‌ కినిక్స్‌ ఉంటాయి

►9899 చోట్ల బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది

►3841 చోట్ల పనులు మొదలయ్యాయి

►మిగిలిన చోట్ల కూడా వెంటనే పనులు మొదలుకావాలి

►సెప్టెంబరులో ఈ బీఎంసీలను ప్రారంభించబోతున్నాం

►ఆగస్టు 31 నాటికి బీఎంసీల పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి

►25 ఫుడ్‌ ప్రాససింగ్‌ యూనిట్లను పెట్టబోతున్నాం

►ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక యూనిట్‌ఉంటుంది

►దీనికోసం భూములను గుర్తించి.. అక్కడ యూనిట్లను పెట్టించాలి

►కనీసం 10 నుంచి 15 ఎకరాల భూమిని గుర్తించాల్సి ఉంది

►ప్రభుత్వం కొనుగోలు చేసిన వాటిని ప్రాసెస్‌ చేయడానికి ఈ యూనిట్లు ఉపయోగపడతాయి

►గత ఏడాది కాలంలో రైతులను ఆదుకునేందుకు గత ఏడాది రూ.4300 కోట్లు ధరల స్థిరీకరణకు ఖర్చు చేశాం

ఇళ్లపట్టాలు:

♦దరఖాస్తు చేసుకున్నవారు అర్హులని తేలితే 90 రోజుల్లోగా వారికి ఇంటిపట్టా ఇవ్వాలి

♦94శాతం ఇళ్లపట్టాల పంపిణీ పూర్తయ్యింది

♦మిగిలిపోయిన 1,69,558 ఇళ్ల పట్టాలను వెంటనే పంపిణీచేయాలి

♦జిల్లాకలెక్టర్లు దృష్టిపెట్టి వెంటనే పంపిణీ చేయాలి

♦అలాగే టిడ్కోలో పంపిణీచేయాల్సి ఉన్న సుమారు 47వేల ఇళ్లపట్టాలను వెంటనే పూర్తిచేయాలి

♦అర్హులైన వారికి కచ్చితంగా ఇళ్లపట్టాలు ఇవ్వాలి

♦పెండింగులో ఉన్న అప్లికేషన్లను వెంటనే వెరిఫికేషన్‌ చేసి... అర్హులకు పట్టాలు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలి

♦కొత్తగా వచ్చిన దరఖాస్తులకు సంబంధించి అవసమైన చోట వెంటనే భూమిని సేకరించాలి

♦ఇళ్లపట్టాల దరఖాస్తులను తిరస్కరించేటప్పుడు ఎందుకు తిరస్కరిస్తున్నామో చెప్పగలగాలి

♦కారణాలు లేకుండా దరఖాస్తులను తిరస్కరించరాదు

♦ఒకవేళ దరఖాస్తును తిరస్కరించిన తర్వాత కూడా, తగిన కారణాలతో మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది

♦అలాంటి దరఖాస్తులను మళ్లీ రీ వెరిఫికేషన్‌ చేయాలి:

♦నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కింద తొలివిడతలో 15.6 లక్షల ఇళ్లు కడుతున్నాం

♦ఇళ్లనిర్మాణం జరగడానికి వీలుగా లే అవుట్‌లో బోరు, కరెంటు సౌకర్యం ఉండాలి

♦తొలివిడతలో 8682 కాలనీల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవుతుంది

♦ప్రతిచోటా బోరు, కరెంటు సౌకర్యం కచ్చితంగా ఉండాలి

♦ఏప్రిల్‌ 15 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవుతుంది

♦అలోగా బోరు, కరెంటు సౌకర్యం ఏర్పాటు చేయడంపట్ల అధికారులు చర్యలు తీసుకోవాలి

♦ఇళ్ల నిర్మాణానికి సన్నాహకంగా మ్యాపింగ్, జియో ట్యాగింగ్, ఏపీ హౌసింగ్‌ వెబ్‌సైట్‌లో లబ్ధిదారుని రిజిస్ట్రేషన్, ఉపాధి హామీ కింద జాబ్‌కార్డుల జారీ ఈ పనులన్నీకూడా ఏప్రిల్‌ 10లోగా పూర్తికావాలి

♦హౌసింగ్‌ కార్యర్రమాన్ని పర్యవేక్షించడానికి జిల్లాస్థాయి, డివిజన్‌ స్థాయి అధికారులను ప్రతి మండలానికీ, ప్రతి మున్సిపాల్టీకి నోడల్‌ అధికారులుగా నియమించాలి

♦ప్రతి లే అవుట్‌లో కచ్చితంగా ఒక మోడల్‌ హౌస్‌ను నిర్మించాలి

దీనివల్ల ఇళ్లనిర్మాణంలో వస్తున్న ఇబ్బందులు, నిర్మాణఖర్చు ఎంత అవుతుంది అన్నదానిపై అవగాహన వస్తుంది, అంతేకాకుండా కట్టి ఇల్లు ఎలా ఉందో లబ్ధిదారులకు తెలుస్తుంది

♦ఏప్రిల్‌ 15 నాటికి మోడల్‌ ఇళ్ల నిర్మాణాలు పూర్తికావాలి

♦ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు, డిజిటిల్‌ అసిస్టెంట్లు, వెల్ఫేర్‌ అసిస్టెంట్ల సేవలను ఇళ్లనిర్మాణంలో వినియోగించుకోండి

♦లబ్ధిదారుల ఎంచుకున్న ఆప్షన్‌ ప్రకారం సిమెంటు, స్టీల్, ఇసుక, మెటల్, ఇటుకలు అందించడానికి సిద్ధం చేసుకోవాలి

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Health Tips: పొద్దున్నే లేవగానే కడుపు కదలడం లేదా..మలబద్ధకంతో మెలికలు తిరిగి పోతున్నారా...అయితే ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు... క్షణాల్లో కడుపు ఖాళీ ఇవ్వడం ఖాయం...

SLBC Tunnel Collapse: నల్గొండ SLBC టన్నెల్ వద్ద ప్రమాదం.. మూడు మీటర్ల మేర కూలిన పైకప్పు, ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా, పనులు మొదలు పెట్టిన వెంటనే ప్రమాదమా? అని బీఆర్ఎస్ ఫైర్

MLC Kavitha: చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి... పసుపు బోర్డుకు చట్టబద్దత ఏది? అని మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత, మార్చి 1లోపు బోనస్ ప్రకటించాలని డిమాండ్

Health Tips: మీ శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా పెరిగాయి అయితే సొరకాయ రసంతో ఈ సమస్యకు చక్కటి పరిష్కారం..

Share Now