IPL Auction 2025 Live

CM Jagan Writes to Union Ministers: తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోంది, కేంద్ర మంత్రులకు లేఖల ద్వారా ఫిర్యాదు చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్, తెలంగాణ ప్రాజెక్టులు సందర్శించాకే ఏపీ ప్రాజెక్టులు సందర్శించాలని లేఖలో తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

ఆ రాష్ట్ర వైఖరితో ఏపీ తన వాటా జలాలను కోల్పోతోందని ఏపీ సీఎం వైయస్ జగన్‌ మోహన్ రెడ్డి (Andhra Pradesh CM Jagan Mohan Reddy) అన్నారు. ఈ మేరకు కేంద్రమంత్రులు గజేంద్ర షెకావత్‌, ప్రకాష్‌ జవదేకర్‌కు (union ministers Shekhawat, Javadekar) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వేర్వేరుగా లేఖలు (Cm Jagan Writes to Union Ministers) రాశారు.

CM YS jagan Review Meeting (Photo-Twitter)

Amaravati, July 5: కృష్ణా జలాలపై తెలంగాణ నిబంధనలు ఉల్లంఘిస్తోందని.. ఆ రాష్ట్ర వైఖరితో ఏపీ తన వాటా జలాలను కోల్పోతోందని ఏపీ సీఎం వైయస్ జగన్‌ మోహన్ రెడ్డి (Andhra Pradesh CM Jagan Mohan Reddy) అన్నారు. ఈ మేరకు కేంద్రమంత్రులు గజేంద్ర షెకావత్‌, ప్రకాష్‌ జవదేకర్‌కు (union ministers Shekhawat, Javadekar) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వేర్వేరుగా లేఖలు (Cm Jagan Writes to Union Ministers) రాశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ మరోసారి సీఎం వైఎస్‌ జగన్‌ ఫిర్యాదు చేశారు. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న అక్రమ ప్రాజెక్టులను సందర్శించాకే.. రాయలసీమ లిఫ్ట్‌ సందర్శించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ని ఆదేశించాలని సీఎం వైఎస్‌ జగన్‌ లేఖలో కోరారు.

నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ (Telangana) విద్యుదుత్పత్తి చేస్తోందన్నారు. కృష్ణా నదీజలాల యాజమాన్య బోర్డు(kRMB) అనుమతి లేకుండా నాగార్జున సాగర్‌లో తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోంది. తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టులను పట్టించుకోకుండా రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు కేఆర్‌ఎంబీ ఉత్సాహం చూపుతోంది. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను తొలుత సందర్శించాలి. ఆ తర్వాతే రాయలసీమ లిఫ్ట్‌ సందర్శించాలి.

సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం, ఆ నాలుగు రకాల బీమా పథకాల క్లెయిమ్స్‌ నెల రోజుల్లోనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు, బీమా పథకాల వివరాలు ఓ సారి తెలుసుకోండి

కేఆర్‌ఎంబీ సూచనలను తెలంగాణ పదేపదే ఉల్లంఘిస్తోంది. ఆ రాష్ట్ర వైఖరితో కృష్ణా జలాలు (Krishna River) సముద్రంలో కలుస్తున్నాయి. శ్రీశైలంలో 834 అడుగుల కన్నా తక్కువున్నా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. జూన్‌ 1 నుంచి విద్యుదుత్పత్తికి తెలంగాణ 19 టీఎంసీలు వాడింది. తెలంగాణ ఇలాగే వ్యవహరిస్తే శ్రీశైలం నిండటం దాదాపు అసాధ్యం. 96 అడుగుల నీటిమట్టం నుంచి తెలంగాణ నీటిని తోడేస్తోందని..శ్రీశైలంలో 854 అడుగుల లేకుంటే పోతిరెడ్డిపాడుకు గ్రావిటీ ద్వారా నీరు తీసుకెళ్లలేం. పోతిరెడ్డిపాడుపై ఆధారపడిన ప్రాజెక్టులకు జలాలు రావు. దీంతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగునీటి ఇబ్బందులు తప్పవని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌కు సీఎం జగన్ లేఖ రాశారు.

ఏపీ ప్రభుత్వానివి నిరాధారమైన ఆరోపణలు, నిబంధనలకు లోబడే విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నాం, కృష్ణా బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసిన ఏపీ ప్రభుత్వం

ఈ వ్యవహారంలో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ, కేఆర్‌ఎంబీకి ఫిర్యాదులు చేసినా చర్యలు లేవు. తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టులను పట్టించుకోకుండా ఆ రాష్ట్రం ఇచ్చే ఫిర్యాదులపై కేఆర్‌ఎంబీ వేగంగా స్పందిస్తోంది. ఏపీ ఫిర్యాదులను ఏమాత్రం పట్టించుకోకుండా వివక్ష చూపుతోంది. తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు పూర్తిచేస్తే శ్రీశైలంలో చుక్క నీరు మిగలదు. మరో అవకాశం లేకే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టాం. సీమ ఎత్తిపోతలతో రోజుకు 3 టీఎంసీల తరలింపు సాధ్యపడుతుంది. ఏపీపై వివక్ష చూపొద్దని కేఆర్‌ఎంబీని ఆదేశించాలి’’ అని జగన్‌ లేఖలో పేర్కొన్నారు.

సొంత జిల్లాకు ఏపీ ముఖ్యమంత్రి, జూలై నెల 8, 9వ తేదీల్లో వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్న వైయస్ జగన్, 9వ తేదీ బద్వేలులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపిన కలెక్టర్‌ సి.హరికిరణ్‌

తెలంగాణ పాలమూరు-రంగారెడ్డి, దిండి, కల్వకుర్తి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోందని, కేంద్ర జలశక్తి, కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు అనేక ఫిర్యాదులు చేసినా సరైన చర్యలు చేపట్టలేదని తెలిపారు. శ్రీశైలంలో 854 అడుగుల నీరు లేకుంటే కరువు ప్రాంతమైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందించే అవకాశం లేదు. పాలమూరు రంగారెడ్డి, దిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను 800 అడుగుల వద్ద పర్యావరణ అనుమతి లేకుండా తెలంగాణ నిర్మిస్తోందని లేఖలో పేర్కోన్నారు.

కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ : మరోవైపు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌కు కూడా సీఎం జగన్‌ లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు. సీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను జూన్‌ 30న సీడబ్ల్యూసీకి అప్‌లోడ్‌ చేశామన్నారు. ఈ పథకానికి భూసేకరణ చేయడం లేదని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ ప్రాంతం, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల అడ్డంకులు లేవన్నారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు పర్యావరణ అనుమతి ఇవ్వాలని కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌కు రాసిన లేఖలో సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డ్‌ నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా ప్రాజెక్టుల్లో తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. ‘‘జూన్‌ 1 నుంచి విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. నాగార్జునసాగర్‌, కృష్ణా డెల్టా పరిధిలో ఇరిగేషన్‌ అవసరాలు లేకుండా తెలంగాణ నీటిని వినియోగిస్తోంది.

విద్యుత్‌ ఉత్పత్తి కోసమే ఇప్పటి వరకు 19 టీఎంసీల నీటిని వినియోగించింది. 854 అడుగులకు చేరితే గానీ పోతిరెడ్డిపాడుకు నీటిని తీసుకునే అవకాశం లేదని’’ లేఖలో సీఎం జగన్‌ పేర్కొన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించి ఇప్పటికే కేంద్ర జలవనరుల కమిషనర్‌కు పూర్తి డీపీఆర్‌ను అందజేశామని.. రాయలసీమ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని లేఖలో సీఎం జగన్‌ పేర్కొన్నారు.