AP CM YS Jagan Mohan Reddy (photo-Twitter)

YSR Kadapa, July 5: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి జూలై నెల 8, 9వ తేదీల్లో వైయస్సార్ జిల్లా పర్యటనకు (CM Jagan to Visit YSR District) రానున్నారు. 9వ తేదీ బద్వేలులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం (AP CM YS Jagan Mohan Reddy) అయిన తర్వాత తొలిసారిగా ఆయన బద్వేలు రానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 9వ తేదీన మున్సిపాలిటీ తోపాటు గా నియోజకవర్గానికి సంబంధించిన సుమారు 400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు బద్వేలు పర్యటనకు వస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడించారు. సీఎం జగన్ నాయకత్వంలో కడపలో అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ది జరుగుతుందని ఆయన వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ఆదివారం బద్వేలులోని పలు ప్రాంతాలను కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, కలెక్టర్‌ సి.హరికిరణ్, మాజీ ఎమ్మెల్సీ డీసీగోవిందరెడ్డి పరిశీలించారు. ఇందులో భాగంగా స్థానిక బైపాస్‌రోడ్డులోని బహిరంగ సభ స్థలాన్ని, హెలిప్యాడ్‌కు సంబంధించి సిద్దవటంరోడ్డులోని ఓ స్థలాన్ని, మైదుకూరురోడ్డులోని ఓ స్థలాన్ని పరిశీలించారు. ఈ నెల 8, 9వ తేదీల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనకు ( kadapa Distirict on july 8th and 9th) వస్తున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ సి.హరికిరణ్‌ తెలిపారు.

శ్రీశైలం మహాక్షేత్రం దగ్గర డ్రోన్ల కలకలం, రహస్యంగా ఆలయ పరిసర ప్రాంతాల సమాచారం సేకరించిందనే అనుమానాలు, డ్రోన్ల కదలికలను తెలుసుకోవడానికి రంగంలోకి దిగిన పోలీసులు

కార్యక్రమంలో జేసీలు గౌతమి, ధర్మచంద్రారెడ్డి, సబ్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్, అడా చైర్మన్‌ సింగసానిగురుమోహన్, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ కె.రమణారెడ్డి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ గోపాలస్వామి, వైఎస్సార్‌సీపీ వార్డు ఇన్‌చార్జిలు సుందర్‌రామిరెడ్డి, యద్దారెడ్డి, పుత్తాశ్రీరాములు, బంగారుశీనయ్య, నారాయణరెడ్డి, పోలిరెడ్డి, మండల కనీ​నర్‌ బోడపాటిరామసుబ్బారెడ్డి, ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ మహేశ్వర్‌రెడ్డి, ఈఈ ప్రభాకర్‌నాయుడు, డీఈ రమేష్‌, మైదుకూరు డీఎస్పీ విజయ్‌కుమార్, తహసీల్దారు శ్రీనివాసులరెడ్డి, మున్సిపల్‌ కమీషనర్‌ కె.వి.కృష్ణారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

జలవివాదం..తెలంగాణ వైఖరిపై కేంద్రానికి లేఖ రాయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం, రాష్ట్ర హక్కులకు సంబంధించి రాజీ పడేది లేదని స్పష్టం చేసిన జగన్ సర్కారు

అనంతరం కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 9వ తేదీన మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గానికి సంబంధించిన సుమారు రూ.400 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు బద్వేలు పర్యటనకు రానున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ డీసీగోవిందరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి బద్వేలుకు వస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు పరిశీలించినట్లు తెలిపారు.