ap-capital-cabinet- (Photo-Facebook)

Amaravati, June 30: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ ప్రారంభం అయింది. ఈ భేటిలో (Cabinet Meeting) ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ జలవివాదంపై ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర హక్కులకు సంబంధించి రాజీ పడేదిలేదని స్పష్టం చేస్తూ బుధవారం తీర్మానం చేసింది. ఈ సందర్భంగా... శ్రీశైలం జల విద్యుత్‌ ఉత్పత్తి విషయంలోనూ తెలంగాణ వైఖరిని ఏపీ కేబినెట్‌ తప్పుబట్టింది. తెలంగాణ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ విషయంపై ప్రధాని మోదీకి లేఖ రాయాలని నిర్ణయం తీసుకుంది. కాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం బుధవారం భేటీ అయింది.

కాగా కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (Krishna river Management board) ఆదేశాలను పట్టించుకోకుండా, ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం విషయంలో యథేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. జలాశయంలో కనీస డ్రాయింగ్‌ లెవల్‌కు నీటి మట్టం చేరుకోకపోయినప్పటికీ పూర్తి సామర్థ్యంతో జల విద్యుదుత్పత్తి చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం (TS Govt) సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

కృష్ణా నది కరకట్ట పనులకు సీఎం జగన్ శంకుస్థాపన, కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు 15.525 కి.మీ. మేర విస్తరణ పనులు, కరకట్ట పనుల కోసం రూ. 150 కోట్లు ఖర్చు చేయనున్న ఏపీ ప్రభుత్వం

ఈ సమావేశంలో జులై 8న రైతు దినోత్సవం నిర్వహణపై కేబినెట్ చర్చించనుంది. నూతన ఐటీ పాలసీకి ఆమోదం, జగనన్న టౌన్‌షిప్ ప్రోగ్రాంపై చర్చ జరగనుంది. రైతుల కోసం ఈ-విక్రయ కార్పొరేషన్ ఏర్పాటుపై మంత్రివర్గం చర్చించనుంది. వైఎస్సార్‌ బీమా పథకం అమలుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. పేదలందరికీ ఇళ్లు మెగా గ్రౌండింగ్‌.. జులై 1, 3, 4 తేదీల్లో పెద్దఎత్తున ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల కొనుగోలుపై రాష్ట్ర కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.