Disha App Awareness Drive: దిశ యాప్‌కు మహిళా పోలీసులు, వాలంటీర్లే అంబాసిడర్లు, గొల్లపూడిలో దిశ మొబైల్‌ యాప్‌ అవగాహన సదస్సులో పాల్గొన్న ఏపీ సీఎం వైయస్ జగన్, ప్రతి మహిళతో దిశ యాప్ డౌన్‌లోడ్ చేయించాలని పిలుపు

సీఎం జగన్‌ సమక్షంలోనే వాలంటీర్లు దిశా యాప్‌ లైవ్‌ డెమో చేసి చూపించారు. యాప్‌ నుంచి మెసేజ్‌ వెళ్లిన వెంటనే భవానీపురం పోలీసులు స్పందించి.. నిమిషాల్లోనే లొకేషన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతి మహిళకు దిశ యాప్‌ అవసరమని, దిశ యాప్‌పై ఇంటి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి (AP CM YS Jagan) తెలిపారు.

AP CM YS Jagan To Attend Disha App Awareness Drive At Gollapudi (Photo-Video grab)

Amaravati, June 29: విజయవాడ గొల్లపూడిలో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్వర్యంలో దిశ మొబైల్‌ యాప్‌ అవగాహన సదస్సు ( Disha App Awareness Drive) జరిగింది. సీఎం జగన్‌ సమక్షంలోనే వాలంటీర్లు దిశా యాప్‌ లైవ్‌ డెమో చేసి చూపించారు. యాప్‌ నుంచి మెసేజ్‌ వెళ్లిన వెంటనే భవానీపురం పోలీసులు స్పందించి.. నిమిషాల్లోనే లొకేషన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతి మహిళకు దిశ యాప్‌ అవసరమని, దిశ యాప్‌పై ఇంటి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి (AP CM YS Jagan) తెలిపారు.

దిశ యాప్‌కు మహిళా పోలీసులు, వాలంటీర్లే అంబాసిడర్లు అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. మంగళవారం ‘దిశ’ మొబైల్‌ యాప్‌ అవగాహన సదస్సులో భాగంగా విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడి గ్రామానికి చేరుకున్న సీఎం జగన్‌ (YS Jagan To Attend Disha App Awareness Drive) మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దిశ మొబైల్‌ యాప్‌ను విద్యార్థినులు, యువతులు, మహిళలు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన స్వయంగా వివరించారు.

ఏపీలో 2300 దిగువకు పడిపోయిన కేసులు, కొత్తగా 2,224 మందికి కోవిడ్, రాష్ట్రంలో ప్రస్తుతం 42,252 యాక్టివ్‌ కేసులు, జులై 1 నుంచి 8 జిల్లాల్లో కొత్త కోవిడ్‌ కర్ఫ్యూ నిబంధనలు, అమరావతి ప్రాంతంలో 5 రోజుల పని మరో ఏడాది పొడిగింపు

దిశ యాప్‌పై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలిని, ప్రతి మహిళతో దిశ యాప్ డౌన్‌లోడ్ చేయించాలని సీఎం జగన్‌ అన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఘటన కలిచివేసిందని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. యువతులు, మహిళల భద్రత కోసం దిశ యాప్ రూపొందించామని, ఇప్పటికే దిశ యాప్ నాలుగు అవార్డులు సొంతం చేసుకుందని గుర్తుచేశారు.

గుంటూరులో యువతిపై దారుణంగా అత్యాచారం, అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారని తెలిపిన హోం మంత్రి, సీరియస్‌గా తీసుకున్న జగన్ సర్కారు

ఇప్పటికే 17 లక్షల మంది దిశ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకున్నారని, స్మార్ట్ ఫోన్‌ ఉండే ప్రతి మహిళ వద్ద దిశ యాప్ ఉండాలని సీఎం జగన్‌ చెప్పారు. ఫోన్‌లో దిశ యాప్‌ ఉంటే ఒక అన్న తోడుగా ఉన్నట్టే, ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్ అని తెలిపారు. పోలీసులు మనకు మంచి చేసే ఆప్తులు, మహిళల భద్రత, రక్షణపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

కాబోయే భర్త కళ్ల ముందే యువతిపై దారుణంగా అత్యాచారం, గుంటూరు సీతానగరం పుష్కర్‌ ఘాట్‌ సమీపంలో దారుణ ఘటన, నాలుగు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపిన అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌

రాష్ట్రంలో 18 దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేసి, దిశ చట్టం కూడా చేశామని సీఎం వైఎస్ జగన్‌ తెలిపారు. దిశ కేసుల కోసం పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం చేపట్టామని, దిశ కేసుల విచారణ కోసం త్వరలోనే ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేస్తామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లు మాట్లాడుతూ.. నేరం జరగడానికి ముందే దాన్ని నియంత్రించాలనుకోవడం గొప్ప చర్య అని, సీఎం జగన్ నిర్ణయాలతో మహిళలకు నిజమైన స్వేచ్ఛ వచ్చిందన్నారు. ఇప్పటి వరకు సీఎం జగన్ లాంటి గొప్ప ముఖ్యమంత్రిని తాము చూడలేదని వాలంటీర్లు చెప్పారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Health Tips: పొద్దున్నే లేవగానే కడుపు కదలడం లేదా..మలబద్ధకంతో మెలికలు తిరిగి పోతున్నారా...అయితే ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు... క్షణాల్లో కడుపు ఖాళీ ఇవ్వడం ఖాయం...

SLBC Tunnel Collapse: నల్గొండ SLBC టన్నెల్ వద్ద ప్రమాదం.. మూడు మీటర్ల మేర కూలిన పైకప్పు, ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా, పనులు మొదలు పెట్టిన వెంటనే ప్రమాదమా? అని బీఆర్ఎస్ ఫైర్

MLC Kavitha: చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి... పసుపు బోర్డుకు చట్టబద్దత ఏది? అని మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత, మార్చి 1లోపు బోనస్ ప్రకటించాలని డిమాండ్

Health Tips: మీ శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా పెరిగాయి అయితే సొరకాయ రసంతో ఈ సమస్యకు చక్కటి పరిష్కారం..

Share Now