CM Jagan Review on floods: ముంపు బాధితుల కుటుంబాలకు ఒక్కో ఇంటికి రూ.2 వేల ఆర్థిక సాయం, గోదావరి వరద పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
వరద పరిస్థితులపై (Godavari flood situation) కలెక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అధికారులంతా సహాయ పునరావాస కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు కాబట్టా నాతో రానవసరం లేదని అందుకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నానని సీఎం జగన్ తెలిపారు. ముంపు బాధితుల కుటుంబాలకు ఒక్కొంటికి రూ.2 వేల చొప్పున సహాయం అందించాలని సీఎం ఆదేశించారు.
Amaravati, August 18: గోదావరి వరద పరిస్థితులపై ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ (AP CM YS Jagan video conference) నిర్వహించారు. వరద పరిస్థితులపై (Godavari flood situation) కలెక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అధికారులంతా సహాయ పునరావాస కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు కాబట్టా నాతో రానవసరం లేదని అందుకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నానని సీఎం జగన్ తెలిపారు. ముంపు బాధితుల కుటుంబాలకు ఒక్కొంటికి రూ.2 వేల చొప్పున సహాయం అందించాలని సీఎం ఆదేశించారు. ముంపు బాధితుల పట్ల మానవత్వంతో, ఉదారంగా వ్యవహరించాలని ఆయన కోరారు.
మన ఇంట్లో సమస్యగానే భావించి వారికి అండగా నిలవాలని పేర్కొన్నారు. ఖర్చు విషయంలో వెనుకాడ వద్దని సీఎం స్పష్టం చేశారు.ఈ రాత్రికి 17 లక్షల క్యూసెక్కులకు, రేపు ఉదయానికి 12 లక్షల క్యూసెక్కులకు, ఎల్లుండికి 8 లక్షల క్యూసెక్కులకు వరద తగ్గుతుందన్న సమాచారం వస్తోంది. వరద తగ్గుముఖం పట్టగానే 10 రోజుల్లో పంట నష్టం అంచనాలు పంపించాలి. ఎన్యుమరేషన్ 10 రోజుల్లోగా చేయాలి. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఫోన్ ట్యాపింగ్ అంతా డ్రామా, చంద్రబాబుపై మండిపడిన ఏపీ హోంమంత్రి సుచరిత, ఆధారాలతో డీజీపీకి ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన హోం మంత్రి
పోలవరం నియోజకవర్గంలో 60 గ్రామాలు వరదలో చిక్కుకున్నాయని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. మంగళవారం ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వేలేరుపాడులో పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే.. గర్భిణీల ఆరోగ్యం అడిగి తెలుసుకున్నారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదువేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని పేర్కొన్నారు. ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మూడు నెలలకు సరిపడ నిత్యావసర వస్తువులు సిద్ధంగా ఉంచామని ఎమ్మెల్యే బాలరాజు వెల్లడించారు.