AP Coronavirus Update: నందిగామ వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా, రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన కేసులు, తాజాగా 6,235 మందికి కరోనా, యాక్టివ్‌గా 74,518 కేసులు, 5,410కు చేరిన మరణాలు

ఇప్పటివరకు ఏపీలో 6,31,749కి కరోనా కేసులు (COVID-19 cases) చేరాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు కరోనాతో 51 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 5,410 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 74,518 యాక్టివ్ కేసులున్నాయి. ఈ రోజు వరకు కరోనా నుంచి కోలుకుని 5,51,821 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 51.60 లక్షల కరోనా టెస్టుల నిర్వహించారు.

Coronavirus Outbreak | (Photo Credits: IANS|Representational Image)

Amaravati, Sep 21: ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,235 కరోనా కేసులు (AP Coronavirus Update) నమోదయ్యాయి. ఇప్పటివరకు ఏపీలో 6,31,749కి కరోనా కేసులు (COVID-19 cases) చేరాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు కరోనాతో 51 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 5,410 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 74,518 యాక్టివ్ కేసులున్నాయి. ఈ రోజు వరకు కరోనా నుంచి కోలుకుని 5,51,821 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 51.60 లక్షల కరోనా టెస్టుల నిర్వహించారు.

కొత్తగా కృష్ణా 9, చిత్తూరు 7, విశాఖ 6, అనంతపురంలో ఐదుగురు మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా, గుంటూరు, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. కర్నూలు 3, కడప 2, ప్రకాశం 2, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఈ రోజు కొత్తగా తూర్పుగోదావరి జిల్లాలో 1,262, పశ్చిమగోదావరి జిల్లాలో 962, ప్రకాశం 841 కరోనా కేసులు నమోదయ్యాయి.

 ఏపీ రాజధాని తరలింపు, అక్టోబరు 5 వరకు స్టేటస్ కోను పొడిగించిన ఏపీ హైకోర్టు, అంశాల వారీగా పిటిషన్ల విచారణ జరపాలని నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో నందిగామ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్‌మోహన్‌రావుకు (Monditoka Jagan Mohan Rao) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో కరోనా టెస్ట్‌ చేయించుకోగా పాజిటివ్‌ వచ్చినట్లు ఆయన (Nandigama MLA) తెలిపారు. గత నాలుగు రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారు కోవిడ్‌ పరీక్ష చేయించుకుని హోం క్వారంటైన్‌లో ఉండాలని ఎమ్మెల్యే కోరారు.

చికిత్స తీసుకుంటున్న కారణంగా కొన్ని రోజుల వరకు తనను పరామర్శించడానికి ఎవరు ఫోన్ చేయొద్దని, కలవటానికి ప్రయత్నించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. భగవంతుడు, ప్రజల ఆశీస్సులతో త్వరలోనే కోలుకుని ప్రజల ముందుకు వస్తానని ఎమ్మెల్యే జగన్‌మోహన్‌రావు పేర్కొన్నారు.