Deputy CM Pawan Kalyan in Vijayawada: ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా బెజవాడ దుర్గమ్మ గుడి మెట్లు శుద్ధి చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌

ఇందులో భాగంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండ మీద ఉన్న దుర్గమ్మను దర్శించుకొన్న పవన్ కల్యాణ్‌.. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఆలయం మెట్లను శుద్ధి చేశారు.

Deputy CM Pawan Kalyan in Vijayawada (Credits: X)

Vijayawada, Sep 24: తిరుమల లడ్డూ (Tirumala Laddu) ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగినట్టు నిర్ధారణ అయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) ‘ప్రాయశ్చిత్త దీక్ష’ మొదలుపెట్టడం తెలిసిందే. ఇందులో భాగంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండ మీద ఉన్న దుర్గమ్మను  దర్శించుకొన్న పవన్ కల్యాణ్‌.. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఆలయం మెట్లను శుద్ధి చేశారు. మరోవైపు వచ్చే నెల 1వ తేదీన అలిపిరి మెట్ల మార్గం ద్వారా పవన్‌ తిరుమలకు వెళ్లనున్నారు. 2వ తేదీన శ్రీ వేంకటేశ్వర స్వామిని వారిని దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు.

బీఆర్‌కే న్యూస్‌ చానల్‌ అధినేత బొల్లా రామకృష్ణ ఇంట్లో ఐటీ సోదాలు.. సోదాల్లో పాల్గొన్న 8 మంది అధికారులు (వీడియో)

సర్వత్రా ఆసక్తి

‘ప్రాయశ్చిత్త దీక్ష’ ముగిసిన అనంతరం జనసేనాని 3వ తేదీన తిరుపతిలో వారాహి సభ నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు. అయితే, ఆయన ఏం మాట్లాడబోతున్నారన్న విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది.

దేశంలో మంకీపాక్స్ క్లాడ్ 1బీ తొలి కేసు నమోదు, కేరళకు చెందిన 38 ఏళ్ల వ్యక్తికి వైరస్ నిర్ధారణ, ఇప్పటికే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్‌ఓ 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif