Andhra Pradesh: నీవు కార్పొరేటర్‌గా కూడా గెలవలేవు పవన్, షూటింగ్ గ్యాప్లో బయటికి వచ్చి ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్న చంద్రబాబు దత్తపుత్రుడు, జనసేనానిపై విరుచుకుపడిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్

చంద్రబాబు దత్తపుత్రుడు షూటింగ్ గ్యాప్లో బయటికి వచ్చి.. సంక్షేమ పాలన అందిస్తున్న ప్రభుత్వంపై అక్కసు వెల్లగక్కుతున్నాడని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ (AP Ex Minister Vellampalli Srinivas) మండిపడ్డారు.

AP Ex Minister Vellampalli Srinivas (Photo-Video Grab)

Amaravati, August 23: పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు దత్తపుత్రుడు షూటింగ్ గ్యాప్లో బయటికి వచ్చి.. సంక్షేమ పాలన అందిస్తున్న ప్రభుత్వంపై అక్కసు వెల్లగక్కుతున్నాడని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ (AP Ex Minister Vellampalli Srinivas) మండిపడ్డారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్‌లో గడప గడపకూ మన ప్రభుత్వంలో పాల్గొన్న వెలంపల్లి.. పవన్‌ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు కౌంటర్‌ ఇచ్చారు.

చంద్రబాబు దత్తపుత్రుడు (Pawan Kalyan) షూటింగ్ గ్యాప్ లో బయటికి వచ్చాడు. ప్రజారాజ్యం పార్టీలో అసలైన కోవర్ట్ పవన్ కళ్యాణే. చిరంజీవికి (Chiranjeevi) అధికారం రాలేదని.. ఆయన్ని పక్కకి పెట్టింది పవనే. ప్రజారాజ్యానికి 18 సీట్లు వచ్చాయని అసలు పార్టీలో (PRP) కనపడకుండా పోయాడు. నాడు ప్రజారాజ్యం ను విలీనం చేయవద్దని పవన్‌ ఎందుకు చెప్పలేకపోయాడు?. అసలు ప్రజారాజ్యం పార్టీ విలీనానికి కారణమే పవన్ కళ్యాణ్. మేం పిలుస్తున్నా పవనే రావడం లేదని స్వయంగా నాగబాబు.. మెగా అభిమానుల మధ్య చెప్పాడు.. చిరంజీవి లేకపోతే పవన్ ఎక్కడున్నాడు?. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే పవన్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ, పవన్ కల్యాణ్ కార్పొరేటర్‌గా కూడా గెలవలేడు అని వెల్లంపల్లి జోస్యం చెప్పారు.

పదో తరగతి పరీక్షా విధానంలో కీలక మార్పులు, ఇక నుంచి 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్, ఈనెల 29న ఏపీ కేబినేట్‌ సమావేశం

ప్రజారాజ్యంలో ఉన్న ఎమ్మెల్యేలందరు చివరి వరకు చిరంజీవితోనే ఉన్నారు.. చిరంజీవితో పాటు కాంగ్రెస్ లో మేము కొనసాగామన్నారు. సినిమా ఫంక్షన్ ‌లలో చిరంజీవిని అవమానించే విధంగా వ్యవహరించింది పవన్ కళ్యాణ్ కాదా?? తాను జనసేన పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి …. ఇప్పుడు చిరంజీవి అవసరం వచ్చిందని తెలిపారు. చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు.. జగన్ కు, చిరంజీవికి మధ్య గ్యాప్ తీసుకుని రావాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నాడని ఆగ్రహించారు.

2014లో చంద్రబాబు సీఎమ్‌ కావటానికి పవన్ కళ్యాణ్ సహకరించింది వాస్తవం కాదా?? ఈ రాష్ట్రానికి 20 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని బహిరంగ వేదికలో పవన్ కళ్యాణ్ చెప్పింది వాస్తవం కాదా? అని ఫైర్‌ అయ్యారు. పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి కావాలని కాని, కాపు సామాజిక వర్గానికి అండగా నిలబడాలని గాని ఉండదని… వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 20 చోట్ల పోటీ చేసినా ఓడిపోవటం ఖాయమని మండిపడ్డారు వెల్లంపల్లి శ్రీనివాస్.

ఇక ఎలాంటి తారతమ్యాలు లేకుండా సంక్షేమ పథకాలను అర్హులకు అందిస్తున్న ప్రభుత్వం తమదని.. పథక లబ్ధి అందుకుంటున్న వాళ్లలో టీడీపీ కార్యకర్తలు కూడా ఉంటున్నారని ఆయన గుర్తు చేశారు. కేశినేని నాని ఏ పార్టీలో ఉన్నారో ఎవరికీ తెలియదని, ఎంపీగా ఉన్నా నియోజకవర్గానికి ఏమీ చేయడం లేదని విమర్శించారు.



సంబంధిత వార్తలు

Union Budget 2025-26: వేత‌న‌జీవుల‌కు త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్, రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కు ట్యాక్స్ మిన‌హాయింపు ఇచ్చే యోచ‌న‌లో కేంద్రం, ఈ బడ్జెట్ లో బొనాంజా ప్ర‌కటించే ఛాన్స్

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు