పదో తరగతి పరీక్షా విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. ఇకపై 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు (10th class exams with 6 papers) నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఎస్‌ఈ (CBSE) సిలబస్ నేపథ్యంలో 6 పేపర్ల విధానం అమలు చేయనున్నారు. 2022-23 విద్యా సంవత్సరం నుండి అమలు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది.
ఇక ఈనెల 29వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్‌ఓ) కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం కడపలోని హెడ్‌పోస్టాఫీసు సమీపంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి, థ్యాంక్యూ సీఎం సార్ అని ప్లకార్డులు ప్రదర్శించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లుగా పనిచేస్తున్న వారిని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా ఏపీ ప్రభుత్వం గుర్తించిన సంగతి విదితమే.