Roja On Party Change: పార్టీ మార్పుపై స్పందించిన మాజీ మంత్రి రోజా, అవన్నీ పుకార్లేనని వెల్లడి, పార్టీ మారుతున్న నేతలతో ఎలాంటి నష్టం లేదని వెల్లడి

ఈ సందర్భంగా ఏపీలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. కాలేజీ బాత్రూంలో కెమెరాలు పెట్టి పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. నేరస్తులకు ఇంత ధైర్యం వచ్చిందంటే ప్రభుత్వం సిగ్గు పడాలన్నారు.

AP Ex Minister,YCP Leader Roja Condemns the rumours on Party Change

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మాజీ మంత్రి రోజా. ఈ సందర్భంగా ఏపీలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. కాలేజీ బాత్రూంలో కెమెరాలు పెట్టి పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. నేరస్తులకు ఇంత ధైర్యం వచ్చిందంటే ప్రభుత్వం సిగ్గు పడాలన్నారు.

గుడ్లవల్లేరులో ఏం జరగలేదని ఎస్పీ చెప్పడం దురదృష్టకరం అన్నారు. జగన్ పాలనలో తప్పు చేయాలంటే భయపడేవాళ్లు.ముచ్చుమర్రిలో 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే న్యాయం చేయలేదు అన్నారు.

Here's Video:

ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం, హోంమంత్రి ఎందుకు వెళ్లలేదు అన్నారు. తాను ఏ పార్టీ మారడం లేదు...పార్టీ మారుతున్న వారు ఒకసారి పునరాలోచించుకోవాలన్నారు.2014-19 మధ్యలో కూడా చాలా మంది పార్టీ మారారు,పార్టీ మారడం వల్ల జగన్ కు, వైసీపీకి ఎలాంటి నష్టం ఉండదు అని తేల్చిచెప్పారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎవరూ క్షమించరు అన్నారు.