AP GIS 2023 Live Updates: ఏపీలో జిందాల్ కంపెనీ రూ.10 వేల కోట్ల పెట్టుబడులు, వేదికపైనే ప్రకటించిన నవీన్‌ జిందాల్‌, రూ.5వేల కోట్ల పెట్టుబడి పెడతామని తెలిపిన శ్రీ సిమెంట్

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వైజాగ్ లో ప్రారంభమయింది. సమ్మిట్ లో తొలుత రాష్ట్ర గీతం 'మా తెలుగు తల్లికి' గీతాన్ని ఆలపించారు. ముఖ్యమంత్రి జగన్ జ్యోతిని వెలిగించి సదస్సును ప్రారంభించారు.

CM YS Jagan In Summit (Photo-AP CMO)

Visakha, Mar 3: ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వైజాగ్ లో ప్రారంభమయింది. సమ్మిట్ లో తొలుత రాష్ట్ర గీతం 'మా తెలుగు తల్లికి' గీతాన్ని ఆలపించారు. ముఖ్యమంత్రి జగన్ జ్యోతిని వెలిగించి సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు, ఇన్ఫోటెక్ అధినేత బీవీఆర్ మోహన్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు. మరోవైపు ముఖేశ్ అంబానీని జగన్ ఆప్యాయంగా హత్తుకోవడం అందరినీ ఆకర్షించింది.

విశాఖకు విచ్చేసిన ముఖేష్ అంబానీ, హగ్ చేసుకుని ఆత్మీయ స్వాగతం పలికిన సీఎం జగన్, ప్రారంభమైన ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ 2023

జ్యోతి ప్రజ్వలన అనంతరం సీఎస్ జవహర్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాథ్ ప్రసంగించారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతను ఇస్తూ జగన్ పాలన సాగుతోందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారని చెప్పారు.

పారిశ్రామికరంగ నిపుణులు, వ్యాపారుల రాకతో విశాఖ ధగధగ.. నేడు, రేపు గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు.. కార్పొరేట్‌ దిగ్గజాలతోపాటు 45కుపైగా దేశాల నుంచి ప్రతినిధుల రాక.. పూర్తి వివరాలు ఇవే.. వీడియోతో

ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడుతూ... రాష్ట్రంలో పలు రంగాల్లో లాజిస్టిక్స్ అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. పునరుత్పాదక రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఐటీ ఆధారిత పరిశ్రమలకు మంచి వాతావరణం ఉందని అన్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కొదవలేదని చెప్పారు.

జీఎంఆర్‌ గ్రూప్‌ చైర్మన్‌ జీఎం రావు స్పీచ్‌

►సీఎం జగన్‌ విజన్‌ అద్భుతం

►సీఎ జగన్‌ దార్శనికత ప్రశంసనీయం

►ఏపీలో కనెక్టివిటీ బాగా పెరిగింది

►ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది

►ఏపీలో ఇన్వెస్టర్స్‌ ఫ్రెండ్లీ ఎకో సిస్టమ్‌ ఉంది

►ఎయిర్‌ కనెక్టివిటీ పెరుగుతండటంతో ఏపికి మరిన్ని పరిశ్రమలు

►రాష్ట్ర జీడీపీ సుస్థిరంగా ఉండటం ప్రశంసనీయం

ఏపీలో జిందాల్‌ స్టీల్‌ భారీ పెట్టుబడులు

►రూ. 10 వేల కోట్ల పెట్టుబడిని ప్రకటించిన నవీన్‌ జిందాల్‌

►ఏపీ ప్రగతిలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది

►రూ. 10 వేల కోట్ల పెట్టుబడులతో 10వేల మందికిపైగా ఉపాధి

►ఆర్థిక వృద్ధిలో ఏపీ నంబర్‌వన్‌గా ఉంది

►వేదికపై రూ. 10 వేల కోట్ల పెట్టుబడి ప్రకటించిన నవీన్‌ జిందాల్‌

మార్టిన్‌ ఎబర్‌ హార్డ్‌, టెస్లా కో ఫౌండర్‌ స్పీచ్‌

►గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది

►గ్రీన్‌ ఎనర్జీ పట్ల ఏపీ ఆసక్తి ప్రశంసనీయం

►సుస్థిర అభివృద్ధి ప్రపంచానికి చాలా ముఖ్యం

టోరే ఇండస్ట్రీస్‌ ఎండీ మసహిరో యమగూచి స్పీచ్‌

►ఏపీ ప్రభుత్వం సహకారం మరువలేనిది

►పలు కీలక రంగాల్లో వెంటనే అనుమతులు

కియా ఇండియా ప్రతినిధి కబ్‌ డోంగ్‌ లి ప్రసంగం

►రాష్ట్ర అభివృద్ధిలో కియా తన పాత్ర పోషిస్తుంది

►ప్రభుత్వ సహకారాలు కియా అభివృద్ధికి దోహదపడుతున్నాయి

►ఏపీలో కియా కార్యకలాపాలు సులువుగా సాగిస్తోంది

►ఏపీ ప్రభుత్వ మద్దతు అమోఘం

శ్రీ సిమెంట్‌ చైర్మన్‌ హరిమోహన్‌ స్పీచ్‌

►ఏపీలో నైపుణ్యమైన మానవ వనరులు ఉన్నాయి:

►జగన్‌ నాయకత్వంలో ఏపీ పరిశ్రమల హబ్‌గా మారింది

►కర్బన రహిత వాతావరణం కోసం ఏపీ కృషి ప్రశంసనీయం

►ఏపీ పారిశ్రామికీకరణలో శ్రీసిమెంట్‌ తనదైన పాత్ర పోషిస్తోంది

►రూ. 5వేల కోట్లతో ఏపీలో శ్రీ సిమెంట్‌ పెట్టుబడులు

►శ్రీ సిమెంట్‌ ద్వారా 5 వేల మందికి ఉపాధి

►వేదికపైనే ప్రకటించిన శ్రీ సిమెంట్‌ చైర్మన్‌ హరిమోహన్‌

అపోలో హాస్పిటల్స్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ప్రీతారెడ్డి ప్రసంగం

►ఆరోగ్య రంగంలో ఏపీ సర్కార్‌ కృషి అభినందనీయం

►ఏపీ సర్కార్‌తో అపోలో భాగస్వామిగా ఉండటం సంతోషంగా ఉంది

►ఆరోగ్యశ్రీ పథకం ఆవిష్కర్త వైఎ‍స్పార్‌కృషిని గుర్తు చేసిన ప్రీతారెడ్డి

►ఆరోగ్యశ్రీ పథకం ఇతర దేశాలకు విస్తరించింది

నాఫ్‌ సీఈవో సుమ్మిత్‌ బిదానీ ప్రసంగం

►పరిశ్రమలకు ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారం

►ఏపీలో రోడ్‌ కనెక్టివిటీ, విద్యుత్‌ సౌకర్యాలు బాగున్నాయి

►ఇన్వెస్టర్స్‌ సదస్సు పారిశ్రామికవేత్తలకు ఎంతో ఉపయోగం

భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌ కృష్ణ ఎల్లా ప్రసంగం

►ప్రపంచానికి ఉత్తమమైన మానవ వనరులను ఏపీ అందిస్తోంది

►ఏపీలో వనరులు పుష్కలంగా ఉన్నాయి

►వాటిని సమర్ధవంతంగా వాడుకుంటే ఏపీలో మరింత అభివృద్ధి

►నైపుణ్యాభివృద్ధికి ఏపీ చేస్తున్న కృషి ప్రశంసనీయం

సియాంట్‌ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి స్పీచ్‌

►విశాఖలో మరిన్ని సేవలు విస్తరిస్తాం

►ఏపీలో సంక్షేమ పథకాలు అద్భుతం

►ఐటీ రంగంలో ఏపీ నిపుణుల పాత్ర ఆదర్శనీయం

►విద్యారంగంలో ఏపీ కృషి అమోఘం

►పలు రంగాల్లో సాంకేతిక పాత్ర వేగంగా జరుగుతోంది

►అమ్మఒడి, విద్యాకానుక, విద్యాదీవెన, విదేశీ విద్యా దీవనె పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి

ముఖేష్‌ అంబానీ స్పీచ్‌

►సమ్మిట్‌లో భాగస్వామ్మనైందుకు సంతోషంగా ఉంది:

►పలు రంగాల్లో ఏపీ నంబర్‌వన్‌గా మారుతున్నందుకు శుభాకాంక్షలు: ముఖేష్‌ అంబానీ

►ఏపీలో కీలక రంగాల్లో వనరులు పుష్కలంగా ఉన్నాయి

►పలువురు అంతర్జాతీయ స్థాయి నిపుణులు ఏపీ నుంచే వచ్చారు

►నూతన భారతదేశ నిర్మాణంలో ఏపీ కీలకం కాబోతుంది: ముఖేష్‌ అంబానీ

సజ్జన్‌ భుజంకా స్పీచ్‌

►ఏపీలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి మంచి సహకారం

►ఏపీలో మా కంపెనీ మరింత విస్తరణకు సిద్ధంగా ఉంది

సెంచరీ ఫ్లై బోర్డ్స్‌ చైర్మన్‌

►ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పాల్గొనడం సంతోషకరం: కరణ్‌ అదానీ

►ఏపీలో మౌలిక సదుపాయాలు బాగాన్నాయి

►15 వేల మెగావాట్ల వపర్‌ ప్రాజెక్ట్‌ అభివృద్ధి

-కరణ్‌ అదానీ, సీఈవో అదానీ పోర్ట్స్‌

►ఏపీలో వేల కోట్ల పెట్టబడులు పెట్టబోతున్నాం రెన్యూ పవర్‌ ఎండీ సుమంత్‌ సిన్హా

►ఏపీలో పర్యాటక రంగం అంతర్జాతీయ స్థాయిలో ఉంది: ఒబెరాయ్‌ హోట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ అర్జున్‌ఒబెరాయ్‌

►సీఎం జగన్‌ దార్శనికతతో తొందరగా అనుమతలు

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now