Andhra Pradesh: విద్యార్థుల భవిష్యత్ కోసం జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం, అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించేందుకు ఎడెక్స్‌తో ఒప్పందం

జగన్ సర్కారు ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించేందుకు ప్రముఖ ఆన్‌లైన్‌ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్‌’తో ఒప్పందం చేసుకుంది

CM Jagan (Photo-APCMO/X)

Vjy, Feb 16: విదేశాలకు వెళ్లి చదువుకోలేని పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. జగన్ సర్కారు ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను (international university courses) ఉచితంగా అందించేందుకు ప్రముఖ ఆన్‌లైన్‌ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్‌’తో ఒప్పందం (AP Government Agreement with EdX) చేసుకుంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల్లో భా­గంగా శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎడెక్స్‌ ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నారు.

ఇప్పటికే ఎడె­క్స్, ఉన్నత విద్యాశాఖ సంయుక్తంగా టీచింగ్, లె­ర్నింగ్‌ కోసం కొత్త టెక్నాలజీ, బోధన విధానాలను రూపొందించాయి. హార్వర్డ్, ఎంఐటీ, లండన్‌ స్కూ­ల్‌ ఆఫ్‌ ఎకనావిుక్స్, కొలంబియా, న్యూయార్క్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్స్, ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక వర్సిటీల నుంచి వివిధ కోర్సుల్లో ఏపీ విద్యార్థులు సర్టిఫికేషన్లు సులభంగా పొందొచ్చు. తద్వారా మంచి వేతనాలతో కూడిన జాతీయ, అంతర్జాతీయ ఉద్యోగాలను సాధించేలా ఈ కోర్సు ప్రోత్సహిస్తోంది.

వాలంటీర్లు రాబోయే రోజుల్లో భావి లీడర్లు అవుతారు, వాలంటీర్ల అభినందన సభలో సీఎం జగన్ ప్రసంగం హైలెట్స్ ఇవిగో..

ఈ పోగ్రాం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని 12 లక్షల మందికి పైగా విద్యార్థులు వరల్డ్‌ క్లాస్‌ వర్సిటీలు, ఇతర విద్యాసంస్థలు అందించే రెండు వేలకు పైగా ఎడెక్స్‌ ఆన్‌లైన్‌ కోర్సులను, రెగ్యులర్‌ కోర్సులతో పాటు ఉచితంగా చదువుకోవచ్చు.అనంతరం ఎడెక్స్, అంతర్జాతీయ వర్సి­టీ­ల నుంచి సర్టిఫికెట్లు అందుకుంటారు.కరిక్యులమ్‌లో భాగంగా ఎడెక్స్‌ కోర్సు­లకు అంతర్జాతీయ వర్సిటీలే ఆన్‌లైన్‌లో ఎగ్జామ్స్‌ నిర్వహించి సర్టిఫికెట్లు అందిస్తాయి. శాస్త్ర, సాంకేతిక రంగాలతో పాటు సామాజిక, సాంఘిక శాస్త్రాలకు సంబంధించి వివిధ సబ్జెక్టులను పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉచితంగా నేర్చుకోవచ్చు.