AP Govt Extends SC/ST Sub-Plan: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ మరో 10 ఏళ్ళు పొడిగించిన జగన్ సర్కారు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన వివిధ ప్రజా సంఘాల నేతలు

ఈ మేరకు ఆదివారం ఆర్డినెన్స్‌ను (issues ordinance) జారీచేసింది.

AP Government logo (Photo-Wikimedia Commons)

Amaravati, Jan 23: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి నిర్దేశించిన సబ్‌ప్లాన్‌ (ఉప ప్రణాళిక)ను ప్రభుత్వం మరో పదేళ్లు (AP government Extends SC ST Sub Plan) పొడిగించింది. ఈ మేరకు ఆదివారం ఆర్డినెన్స్‌ను (issues ordinance) జారీచేసింది. దళిత, గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసం పదేళ్ల కాలపరిమితితో ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం ఈ నెల 23తో ముగియనుంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ సబ్‌ప్లాన్‌ను కొనసాగించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు మంత్రులు, వివిధ ప్రజా సంఘాల నేతలు స్పందించారు. ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున స్పందిస్తూ.. సబ్‌ప్లాన్‌ చట్టం 2013 జనవరి 23 నుంచి అమలులోకి వచి్చందని.. చట్ట ప్రకారం పదేళ్ల తర్వాత ఇప్పుడు రద్దయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనిపై సకాలంలో సీఎం వైఎస్‌ జగన్‌ స్పందించి.. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదంతో ముందుగానే ఆర్డినెన్స్‌ తేవడం గొప్ప విషయమన్నారు. దీంతో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపట్ల సీఎం తనకున్న ప్రేమను మరోసారి చూపించారని కొనియాడారు.

హంద్రీ నదిపై కాజ్‌వే నిర్మాణానికి రూ.24 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం, నిర్మాణ పనులను దక్కించుకున్న ఓఎంఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ

సబ్‌ప్లాన్‌ మరో పదేళ్లు కొనసాగేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, దేశంలో మెరుగ్గా సబ్‌ప్లాన్‌ అమలుచేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా నిలవడం వెనుక సీఎం జగన్‌ చిత్తశుద్ధే కారణమని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి.. వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ అన్నారు. సబ్‌ప్లాన్‌ను మరో పదేళ్లు పొడిగించడం హర్షణీయమంటూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.