Amaravati Land Deals Row: హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం, అమరావతి భూముల స్కాంలో ఏసీబీ దర్యాప్తును నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయాలంటూ పిటిషన్

అమరావతి భూముల స్కాంలో ఏసీబీ దర్యాప్తును నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును (AP government has approached the Supreme Court) ఆశ్రయించింది. ఈ మేరకు సోమవారం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయాలని ఈ పిటిషన్‌లో కోరింది. కేసు దర్యాప్తుపై స్టే విధించడం వల్ల కీలకమైన ఆధారాలను నిందితులు నాశనం చేసే అవకాశం ఉందని తన పిటిషన్‌లో పేర్కొంది.

Andhra Pradesh amaravati-bandh-farmers-protest-against-3-capitals (Photo-wikimedia commons)

Amaravati, Sep 21: అమరావతి భూముల స్కాంలో ఏసీబీ దర్యాప్తును నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును (AP government has approached the Supreme Court) ఆశ్రయించింది. ఈ మేరకు సోమవారం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయాలని ఈ పిటిషన్‌లో కోరింది. కేసు దర్యాప్తుపై స్టే విధించడం వల్ల కీలకమైన ఆధారాలను నిందితులు నాశనం చేసే అవకాశం ఉందని తన పిటిషన్‌లో పేర్కొంది.

ఎఫ్ఐఆర్‌ను రిపోర్ట్ చేయవద్దని మీడియాపై నిషేధం విధించారని, ఎఫ్ఐఆర్పై పిటిషనర్ ప్రశ్నించనప్పటికీ వాటిపై సైతం కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపింది. కోర్టును ఆశ్రయించని వారికి సైతం రిలీఫ్ ఇచ్చారని, అమరావతిలో భారీ ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్ కుంభకోణం (Amaravati Land Deals Row) జరిగిందని పేర్కొంది. కీలక పదవిలో ఉన్న వ్యక్తులు అధికారాన్ని దుర్వినియోగం చేశారని పిటిషన్‌లో తెలిపింది.

ఏపీ రాజధాని తరలింపు, అక్టోబరు 5 వరకు స్టేటస్ కోను పొడిగించిన ఏపీ హైకోర్టు, అంశాల వారీగా పిటిషన్ల విచారణ జరపాలని నిర్ణయం

గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో వేల ఎకరాల భూ దోపిడీకి (Amaravanti Land Scam) పాల్పడటంపై సీబీఐతో దర్యాప్తు జరిపి నిగ్గు తేల్చాలని వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ వేదికగా డిమాండ్‌ చేసింది. పార్టీ ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నానిర్వహించి ప్లకార్డులు ప్రదర్శించారు.

Here's YSRCP Tweet

వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, వల్లభనేని బాలశౌరి, బీవీ సత్యవతి, తలారి రంగయ్య, పోచ బ్రహ్మానందరెడ్డి, కోటగిరి శ్రీధర్, లావు శ్రీకృష్ణదేవరాయలు, గోరంట్ల మాధవ్, బెల్లాన చంద్రశేఖర్‌ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు.

Here's YSRCP MPs continue demonstration demanding CBI inquiry

ఏపీ సర్కారు మరో సంచలనం, దేశంలో తొలిసారిగా ఏపీ పోలీస్ శాఖ యాప్ లాంచ్, 87 సర్వీసులు యాప్ ద్వారా అందుబాటులోకి

ఇదిలా ఉంటే అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోని వివరాలను పత్రికలు, టీవీలు, సోషల్‌ మీడియాలో ప్రచురించడం లేదా ప్రసారం చేయరాదంటూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కోరుతూ హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలైంది. తెలంగాణ హైకోర్టులో ప్రాక్టీస్‌ చేస్తున్న న్యాయవాది గలేటి మమత రాణి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అంతేకాక.. అమరావతి భూ కుంభకోణం కేసులో తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్ దాఖలు చేసిన వ్యాజ్యంలో తమను ప్రతివాదిగా చేర్చుకుని, తమ వాదనలు వినాలని మమత రాణి తన అనుబంధ పిటిషన్‌లో కోర్టును కోరారు.

అధికరణ–19 ప్రకారం.. భావ ప్రకటన స్వేచ్ఛ అత్యంత పవిత్రమైన హక్కుగా రాజ్యాంగం గుర్తించిందని మమత రాణి తన అనుబంధ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ పవిత్ర హక్కులో మీడియా హక్కులు కూడా మిళతమై ఉన్నాయన్నారు. ఈ హక్కులను కాలరాసే విధంగా పూర్తిస్థాయి ఆంక్షలు విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేయడంవల్ల రాజ్యాంగంలోని అధికరణ–19(1) (ఏ) ద్వారా పౌరులకు సంక్రమించిన హక్కులకు భంగం కలిగించడమేనని ఆమె వివరించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now