YSR Rythu Bharosa: రైతులకు ఏపీ సర్కారు మరో కానుక, వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ మూడోవిడత నిధులు విడుదల, నివర్‌ తుపాను ఇన్‌పుట్‌ సబ్సిడీ నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రైతులకు మరో కానుక అందించింది. వైయస్సార్ రైతు భరోసా (YSR Rythu Bharosa) కింద అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో మంగళవారం రూ.1,766 కోట్లను జమచేసింది. వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ పథకం మూడోవిడత నిధులు (YSR RYTHU BHAROSA-PM KISAN), అక్టోబరులో వచ్చిన నివర్‌ తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ) కింద ఇస్తామన్న నిధుల్ని ప్రభుత్వం జమచేసింది.

AP CM YS Jagan Mohan Reddy (Photo-Twitter)

Amaravati, Dec 29: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రైతులకు మరో కానుక అందించింది. వైయస్సార్ రైతు భరోసా (YSR Rythu Bharosa) కింద అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో మంగళవారం రూ.1,766 కోట్లను జమచేసింది. వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ పథకం మూడోవిడత నిధులు (YSR RYTHU BHAROSA-PM KISAN), అక్టోబరులో వచ్చిన నివర్‌ తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ) కింద ఇస్తామన్న నిధుల్ని ప్రభుత్వం జమచేసింది.

వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ మూడోవిడత కింద రూ.1,120 కోట్లు, నివర్‌ తుపాను కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ.646 కోట్లను చెల్లిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. కంప్యూటర్‌లో మీట నొక్కి చెల్లింపుల కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో శుభకార్యానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. రైతుల ఖాతాల్లో రూ.1,766 కోట్లు (YSR Rythu Bharosa Phase 3) జమ చేస్తున్నాం. మూడో విడత రైతు భరోసాగా రూ.1,120 కోట్లు, నివర్ తుపాను పరిహారం కింద రూ.646 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ జమ చేస్తున్నాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతులకు మంచి ధరలు రావాలనేదే మా లక్ష్యం. గత ప్రభుత్వం రూ.87,612 కోట్లు రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రైతులను నిలువునా ముంచింది.

ఏపీ సర్కారుకు హైకోర్టులో ఊరట, టిడ్కో ఇళ్ల లబ్దిదారుల పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీకి హైకోర్టు నిరాకరణ, తదుపరి విచారణను జనవరి 5కు వాయిదా

కేవలం రూ.12 కోట్లు కూడా ఇవ్వలేదని స్వయంగా ఆర్బీఐ చెప్పింది. ధాన్యం, విత్తనం, ఇన్సూరెన్స్, విద్యుత్ బకాయిలు, సున్నా వడ్డీ రుణాలు ఎగ్గొట్టారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా చెల్లించాం. గత ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకున్న 434 కుటుంబాలకు సాయం చేశాం. వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్ కింద రూ.13,101 కోట్లు అందించాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నలకు రూ,13,500 ఇస్తున్నాం. కౌలు రైతులకు, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు సాయం చేశామని తెలిపారు.

జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం, ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ, ఏపీలో పూర్తయిన అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి నూతన రథం

ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నివర్ నష్టపరిహారం ఇస్తామని ఇప్పటికే పలుమార్లు చెప్పామని సీఎం గుర్తు చేశారు. అయినా కూడా చంద్రబాబు ప్రతిపక్షనేతగా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పుత్రుడిని, దత్తపుత్రుడిని ఒక్క రోజు ముందు చంద్రబాబు రోడ్డు మీదకు పంపారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు జూమ్‌కు దగ్గరగా.. భూమికి దూరంగా ఉంటున్నారని సీఎం జగన్‌ సెటైర్లు వేశారు. వక్రబుద్ధితో ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement