IPL Auction 2025 Live

AP Legislative Council: మళ్లీ బిల్లును శాసనమండలిలో అడ్డుకుంటారా, ఈ రోజు శాసనమండలి ముందుకు వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు, కల్నల్‌ సంతోష్‌ మృతికి ఏపీ మండలి సంతాపం

శాసనమండలి చైర్మెన్‌ అధ్యక్షతన బుధవారం రోజు 12 నిమిషాలు ఆలస్యంగా సభ ప్రారంభమైంది.ముందుగా తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ (Galwan Valley) ప్రాంతంలో భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు శాసనమండలి సంతాపం తెలిపింది. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ (BJP MLC Madhav) ఈ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు.

AP Legislative council (Photo-Twitter)

Amaravati, June 17: ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి సమావేశాలు (AP Legislative council) రెండో రోజు ప్రారంభమయ్యాయి. శాసనమండలి చైర్మెన్‌ అధ్యక్షతన బుధవారం రోజు 12 నిమిషాలు ఆలస్యంగా సభ ప్రారంభమైంది.ముందుగా తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ (Galwan Valley) ప్రాంతంలో భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు శాసనమండలి సంతాపం తెలిపింది. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ (BJP MLC Madhav) ఈ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఏపీ అసెంబ్లీలో అన్ని బిల్లులు మూజువాణి ఓటుతో పాస్, 3 రాజధానుల ఏర్పాటుకు మార్గం సుగమం, సీఆర్‌డీఏ చట్టం–2014 రద్దు బిల్లుకు ఆమోదం

కల్నల్‌ మృతిపై మండలి రెండు నిమిషాలు మౌనం పాటించింది. తరువాత సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులు మండలి ముందుకు వచ్చినట్లు మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ తెలిపారు. మొదట బడ్జెట్‌పై చర్చ మొదలుపెట్టి.. ఆ తర్వాత బిల్లులపై చర్చ చేపడదామని ఆయన పేర్కొన్నారు.

ఈ రోజు వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో మండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. మండలిలో అవలంభించాల్సిన వ్యూహం గురించి వారితో చర్చించారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి ఇచ్చే అవకాశం లేదని ఓటింగ్ పెట్టి రిజెక్టు చేసినా నెలలో బిల్లులు పాస్ అయిపోతాయని మండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు.