Jogi Ramesh Slams Balakrishna: ఎన్టీఆర్ కొడుకులు పరమశుంఠలు, ఎన్టీఆర్ చివరి కోరికను తీర్చలేని దద్దమ్మలు, బాలకృష్ణపై ఏపీ మంత్రి జోగి రమేష్‌ ఆగ్రహం, మూడు రోజుల తర్వాత నిద్రలేచాడంటూ బాలకృష్ణపై ఘాటువ్యాఖ్యలు

జాతికి, సమాజానికి ఎన్టీఆర్ ని ఎవరు దూరం చేశారు? ఎవరు వెన్నుపోటు పొడిచారు? అని ఆయన నిలదీశారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని లాక్కొని చంద్రబాబుని (Chandra babu) సీఎం సీటులో కూర్చోవడానికి నువ్వేమి చేశావు? అంటూ బాలకృష్ణని ప్రశ్నించారు.

Vijayawada, SEP 24: ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఆ పేరు తొలగించి వైఎస్సార్ పేరు (YSR Name) పెట్టడంతో ఏపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే, నందమూరి తారక రామారావు కుమారుడు బాలకృష్ణ (Balakrishna) చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి జోగి రమేశ్ (Jogi Ramesh) కౌంటర్ ఇచ్చారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… బాలకృష్ణ (balakrishna) మూడు రోజుల తరువాత స్పృహలోకి వచ్చారని ఎద్దేవా చేశారు. జాతికి, సమాజానికి ఎన్టీఆర్ ని ఎవరు దూరం చేశారు? ఎవరు వెన్నుపోటు పొడిచారు? అని ఆయన నిలదీశారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని లాక్కొని చంద్రబాబుని (Chandra babu) సీఎం సీటులో కూర్చోవడానికి నువ్వేమి చేశావు? అంటూ బాలకృష్ణని ప్రశ్నించారు.

YS Sharmila: ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయం పేరు మార్పుపై వైఎస్‌ షర్మిల ధ్వజం.. ఎన్టీఆర్‌తో పాటు కోట్ల మందిని అవమానించినట్లేనని మండిపాటు 

‘‘చంద్రబాబు శునకం.. దానికి తోక బాలకృష్ణ. కుటుంబ విలువలను తుంగలో తొక్కి, ఎన్టీఆర్ (NTR) పెట్టిన పార్టీని లాక్కున్న చంద్రబాబు వెనుక నడిచింది బాలకృష్ణ. చంద్రబాబుకి బుద్ధి చెప్పాలని తండ్రి చివరి కోరిక తీర్చని దద్దమ్మలు మీరు. బాలకృష్ణ మాటలు వింటే శునకాలు చిన్నబుచ్చుకుంటాయి. ఎన్టీఆర్ ని కూర్చి లోంచి దించిన శునకం బాలకృష్ణ. ఎన్టీఆర్ కి ద్రోహం చేసిన చంద్రబాబు కొడుకు లోకేశ్ కు పిల్లనిచ్చిన నిన్ను ఏమనాలి? ఎన్టీఆర్ ని (NTR) చరిత్ర పుటల్లో నిలిచేలా కృష్ణా జిల్లాకు పేరు పెట్టింది సీఎం జగన్ (CM Jagan)’’ అని జోగి రమేశ్ అన్నారు.

YSRCP Permanent President Row: జగన్ పార్టీ జీవితకాల అధ్యక్షుడు కాదు, కేవలం ఐదేళ్ల వరకే పార్టీ అధ్యక్షుడుగా కొనసాగుతారని తెలిపిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి 

‘‘కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినప్పుడు బాలకృష్ణ ఎందుకు ట్వీట్ చేయలేదు. ఎన్టీఆర్ బాలకృష్ణకు జన్మనిస్తే… వైఎస్సార్ పునర్జన్మనిచ్చారు. ఎన్టీఆర్ కుమారులు పరమ శుంఠలు. ఎన్టీఆర్ పేరు మార్పుపై నాలుగు రోజులుగా మీడియాలో వస్తున్నా బాలకృష్ణ అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడలేదు? బాలకృష్ణ నువ్వు ఎన్టీఆర్ రక్తం పంచుకుని పుడితే, రోషం వుంటే ఎన్టీఆర్ చావుకు కారణం అయిన చంద్రబాబును కొట్టు. అసెంబ్లీలో జగన్ మాట్లాడిన మాటలు షర్మిల విని ఉండరు. అందుకే హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడంపై అలా మాట్లాడి ఉంటారు. విని ఉంటే అలా మాట్లాడరు’’ అని జోగి రమేశ్ చెప్పారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif